నన్ను మరీ ఇంత సెక్సీగా చూపిస్తారా? పత్రికపై భగ్గుమన్న హీరోయిన్!
బాలీవుడ్ నటి, మహేష్ బాబు 'టక్కరి దొంగ' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన లీసా రే తాజా ట్వీట్ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఓ ఆంగ్లపత్రికలో ప్రచురితమైన తన ఫోటోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సదరు పత్రిక నిర్వాహకులపై ఆమె మండి పడ్డారు.
క్యాన్సర్ బారిన పడిన లీసారే కొన్నేళ్ల పాటు పోరాటం చేసి ఇటీవలే ఆ వ్యాధి నుంచి కోలుకుని బయట పడ్డారు. ఈ క్రమంలో తన లైఫ్ జర్నీకి సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ పుస్తకం రాశారు. 'క్లోజ్ టు ది బోన్' పేరుతో ఈ బుక్ విడుదలైంది.
లీసారే ఆగ్రహానికి కారణం అదే
లీసారే వయసు ఇపుడు 47 సంవత్సరాలు. ఒకప్పుడు ఆమె ఇండియాలోని టాప్ మోడల్స్‌లో ఒకరు. తన హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్లతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. తన పుస్తకం గురించి ప్రచురితమైన ఆర్టికల్‌కు సెక్సియెస్ట్ ఫోటో జోడించడం ఆమెకు ఆగ్రహం తెప్పించింది.

రచయిత ఫోటో వేసేది ఇలాగేనా?
ఒక పుస్తకానికి సంబంధించిన ఆర్టికల్ రాస్తూ రచయిత ఫోటో వేసేది ఇలాగేనా? అంటూ పత్రికలో ప్రచురితమైన తన సెక్సీ ఫోటోపై లీసారే మండి పడ్డారు. ఒక మహిళగా తాను ఎలా స్ట్రగుల్ అయ్యానో వివరిస్తూ ఈ పుస్తకంలో చర్చించడం జరిగిందని తెలిపారు.

చాలా డిసప్పాయింట్ అయ్యాను
ఇప్పుడే కోల్‌కతాలో ల్యాండ్ అయ్యాను. పత్రికలో నా ఫోటో ఇలా వేయడం చాలా బాధించింది. అందులో ప్రచురితమైంది నా ఫోటో అయినప్పటికీ ఏ సందర్భానికి ఏ ఫోటో వాడాలో తెయలిని స్థితిలో సదరు పత్రిక నిర్వాహకులు ఉండటం బాధాకరం అనే అర్థం వచ్చేలా లీసా రే ట్వీట్ చేశారు.

లీసా రే
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత లీసారే మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయారు. బాలీవుడ్ చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు. త్వరలో ఆమె ‘99 సాంగ్స్' అనే చిత్రంతో కనిపించబోతున్నారు. మ్యూజిక్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నిర్మించారు. హిందీ, తెలుగు, తమిళంలో ఈ మూవీ జూన్ 21న విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











