అమితాబ్ బచ్చన్ మనవరాలితో ఎఫైర్... నిజం ఒప్పుకున్నాడు, ఇదీ జరిగింది...

Recommended Video

Meezan Clears The Air On Dating Navya Naveli Nanda || Filmibeat Telugu

బాలీవుడ్ నటుడు జావేద్ జాఫెరి కుమారుడు మీజాన్ త్వరలో 'మలాల్' అనే సినిమా ద్వారా తెరంగ్రేటం చేయడానికి సిద్దమవుతున్నాడు. ఈ సినిమాలో మీజాన్ సరసన ప్రముఖ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ మేనకోడలు షార్మిన్ సెగల్ హీరోయిన్‌గా తెరంగ్రేటం చేస్తోంది.

గతంలో మీజాన్ మీద ఎఫైర్ రూమర్లు వినిపించాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలితో అతడు డేటింగ్ చేసినట్లు పుకార్లు షికార్లు చేశాయి. అప్పట్లో ఈ ఇద్దరూ క్లోజ్‌గా మూవ్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వడమే ఇందుకు కారణం.

నవ్య నవేలితో ఎఫైర్ వార్తలపై స్పందించిన మీజాన్

నవ్య నవేలితో ఎఫైర్ వార్తలపై స్పందించిన మీజాన్

సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీజాన్... నవ్య నవేలితో ఎపైర్ రూమర్లపై స్పందించారు. మేము ఒకే ఫ్రెండ్ సర్కిల్‌కు చెందిన వారం. నా సిస్టర్ బెస్ట్ ఫ్రెండ్స్‌లో నవ్య ఒకరు. నాకు కూడా గుడ్ ఫ్రెండ్. నేను ఎవరితోనూ రిలేషన్ షిప్‌లో లేనని మీజాన్ స్పష్టం చేశారు.

నేను ఆయన కొడుకును అని తెలియకుండానే మాట ఇచ్చారు

నేను ఆయన కొడుకును అని తెలియకుండానే మాట ఇచ్చారు

‘మలాల్' చిత్రంలో నాతో కలిసి నటిస్తున్న షర్మిన్‌ను 2011లో తొలిసారి కలిశాను. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. సజయ్ లీలా భన్సాలీ తీసిన ‘బాజీరావు మస్తానీ' చిత్రానికి ఆమె కాస్టూమ్ అసిస్టెంటుగా కూడా పని చేశారు. అందులో హీరోగా నటిస్తున్న రణవీర్ సింగ్ అందుబాటలో లేక పోవడంతో కాస్టూమ్స్ ట్రై చేయాలని నన్ను పిలిపించింది. ఆ సమయంలోనే నేను సంజయ్ సర్‌ను తొలిసారి కలిశాను. అప్పటికి నేను జావేద్ జాఫెరి కొడుకుని అని ఆయనకు తెలియదు. నన్ను చూసిన వెంటనే హీరోగా లాంచ్ చేస్తాను అని మాట ఇచ్చారు అని.... మీజాన్ తెలిపారు.

అసిస్టెంటుగా పని చేసిన మీజాన్

అసిస్టెంటుగా పని చేసిన మీజాన్

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘పద్మావత్' చిత్రానికి మీజాన్ అసిస్టెంటుగా కూడా పని చేశారు. ఈ చిత్రంలో రణవీర్, దీపిక పదుకోన్, షాహిద్ కపూర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకుపైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే.

మలాల్

మలాల్ సినిమా విషయానికొస్తే.. ముంబై నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో మీజాన్ మరాఠీ కుర్రాడు శివ పాత్రలో నటించాడు. షార్మిన్ సైగల్... ఆస్తా అనే అమ్మాయి పాత్రలో నటించింది. మంగేష్ హదవాల్ దర్శకత్వం వహించగా, సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్నారు. జూలై 5న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X