అర్జున్‌తో ఎఫైర్, పెళ్లి గురించి నోరు విప్పిన మలైకా.... ఎంజాయ్ చేస్తున్నానంటూ!

బాలీవుడ్ స్టార్స్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ మధ్య కొంతకాలంగా నడుస్తున్న ఎఫైర్ హిందీ చిత్ర సీమలో చర్చనీయాంశం అయింది. అర్భాజ్ ఖాన్‌తో విడాకుల తర్వాత తన కంటే చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో ప్రేమాయణం మొదలు పెట్టిన ఈ హాట్ బ్యూటీ.... కొన్ని రోజుల క్రితం వరకు వరకు రహస్యంగా తన ప్రేమకలాపాలు కొనసాగించిన సంగతి తెలిసిందే.

అయితే ఇటీవల కాలంలో ఇద్దరూ పలు అకేషన్లలో జంటగా హాజరవ్వడం ద్వారా తమ రిలేషన్‌షిప్‌ గురించి మీడియాకు, ప్రజలకు అఫీషియల్‌గా తెలిసేలా చేశారు. దీంతో త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ కూడా ఇది నిజమే అనేలా... పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

అర్జున్‌తో పెళ్లి గురించి తొలిసారి రియాక్ట్ అయిన మలైకా

అర్జున్‌తో పెళ్లి గురించి తొలిసారి రియాక్ట్ అయిన మలైకా

అయితే ఇటీవల ఓ ఆంగ్లప్రతిక ఇంటర్వ్యూలో మలైకా అరోరా స్పందించారు. అర్జున్ కపూర్‌ను మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? అనే ప్రశ్నపై స్పందిస్తూ... ‘నా వ్యక్తిగత విషయాలపై మీరు అడిగే ప్రశ్నలకు స్పందించను. అలా అని నేను మాట్లాడటానికి భయపడటం లేదు. నా పర్సనల్ విషయాలు పబ్లిక్‌గా చెప్పడం ఇష్టం ఉండదు.'' అన్నారు.

నా జీవితం గురించి అందరికీ తెలుసు

నా జీవితం గురించి అందరికీ తెలుసు

‘‘నా జీవితంలో జరిగిన విషయాలు అందరికీ తెలుసు. వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.'' అంటూ మలైకా అరోరా తనదైన శైలిలో స్పందించారు.

జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను

జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను

ప్రస్తుతం నేను నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. లైఫ్ ఎంతో అందమైనది, విలువైనది' అని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి అర్జున్ కపూర్ తన జీవితంలోకి వచ్చిన తర్వాత మలైకా మరింత ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 ఆమెతో సహజీవనం

ఆమెతో సహజీవనం

వాస్తవానికి మలైకా-అర్భాజ్ ఖాన్ విడాకుల ఇష్యూ తెరపైకి రాకముందు నుంచే అర్జున్ కపూర్ పేరు వార్తల్లో మారుమ్రోగింది. విబేధాలతో భర్తకు దూరంగా ఉంటున్న మలైకాకు... అర్జున్ కపూర్ దగ్గరయ్యాడు. పలు సందర్భాల్లో అర్దరాత్రి పూట మలైకా ఇంటి నుంచి బయటకు వస్తూ అర్జున్ కపూర్ మీడియాకు చిక్కిన సంగతి తెలిసిందే.

ఇపుడు అంతా అఫీషియల్

మలైకాకు విడాకులు మంజూరయ్యే వరకు ఇద్దరి వ్యవహరం చాటు మాటుగా సాగింది. అయితే ఇపుడు అంతా అఫీషియల్ అయిపోయింది. సమయం దొరికినప్పుడల్లా ఇద్దరూ విదేశీ టూర్లకు వెళ్లి వస్తున్నారు. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా అర్జున్‌తో వెకేషన్ వెళ్లి వచ్చిన మలైకాను కరణ్ జోహార్ ఆట పట్టించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X