నిన్ను ప్రెగ్నెంట్‌ను చేస్తా .. లైవ్‌లో హీరోయిన్‌తో షారుఖ్ ఖాన్ వ్యాఖ్యలు

ఇప్పటికీ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రసార సాధనం సినిమానే. అందుకే నాటి దర్శకులు సమాజంలో ఉన్న సామాజిక రుగ్మతలు, దురాచారాలు, అవినీతిని సినిమాల ద్వారా వివరించి ప్రజలను చైతన్యం చేశారు. స్మార్ట్‌ఫోన్‌లు, ఓటీటీల రాకతో చాలా రంగాలు కుదేలవుతున్నా సినిమాకి మాత్రం ఆదరణ తగ్గడం లేదు. ఇక భారతదేశంలో సినిమాకు , సినీనటులకు ఉన్న ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ తారలు ఒక్క మాట చెబితే చాలు ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడని అభిమానులు మనదేశంలో ఏ మూలకి వెళ్లినా ఉంటారు. అలాంటి తెరవేల్పులు ఏం మాట్లాడినా, ఏం చేసినా అంతా సంచలనమే.

భారతదేశంలో ఎన్నో భాషల్లో సినిమాలు తెరకెక్కుతుండగా.. వాటిల్లో స్టార్ హీరోలు, హీరోయిన్లు ఉన్నా బాలీవుడ్‌దే పైచేయి. పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ .. హిందీ ఇండస్ట్రీని వణికిస్తున్నా మనదేశంలో బాలీవుడ్‌‌కు ఉన్న గ్లామర్ , మార్కెట్ రేంజ్‌ మరే ఇండస్ట్రీకి లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి బాలీవుడ్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నారు షారుఖ్ ఖాన్. బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్, కింగ్ ఆఫ్ రొమాన్స్, ఎస్ఆర్‌కే ఇలా పలు పేర్లతో ఆయనను అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు.

I will make you pregnant Shah Rukh Khan s controversial comments on Preity Zinta video goes viral

సినిమాలు చేయడంలోనే కాదు, వ్యాపారాలు, సంపద విషయంలోనూ షారుఖ్ దరిదాపుల్లోకి కూడా ఏ హీరో రాలేడు. అయితే ఇంతటి స్టార్‌డమ్, పేరు ప్రఖ్యాతులు షారుఖ్ ఖాన్‌క రాత్రికి రాత్రే రాలేదు. ఛాన్సుల కోసం చెప్పులు అరిగేలా తిరిగాడు.. నీడ లేక బీచ్‌లో పడుకున్న రోజులూ ఉన్నాయి. పూట గడవటం కోసం పలు సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్ర కూడా వేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సెకండ్ హీరోగా, విలన్‌గా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌ను ప్లాన్ చేసుకున్నారు.

ఇలాంటి దశలో ఆదిత్య చోప్రా దర్శకత్వంలో షారుఖ్ ఖాన్- కాజోల్ జంటగా నటించిన దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. నాటి నుంచి ఆయన వెనుదిరిగి చూడకుండా వరుస బ్లాక్‌బస్టర్స్‌తో బాలీవుడ్‌కి, భారతీయ చిత్ర పరిశ్రమకు ఐకాన్‌గా మారారు. పాన్ ఇండియా సినిమాల ధాటికి బాలీవుడ్ ప్రభ కోల్పోతున్న సమయంలో జవాన్, పఠాన్ వంటి చిత్రాలతో హిందీ ఇండస్ట్రీని నిలబెట్టారు షారుఖ్ ఖాన్. 60కి దగ్గరవుతున్నా నేటికీ అదే ఎనర్జీతో సినిమాలు చేస్తూ వెళ్తున్నారు ఖాన్. గౌరీ ఖాన్‌ను ప్రేమించి పెళ్లాడిన ఆయన తన ఇంట్లో హిందూ, ముస్లిం ఆచారాలను, పండుగలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

అలాంటి షారుఖ్ ఓ ఇంటర్వ్యూలో ఏకంగా స్టార్ హీరోయిన్‌ పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నటి ప్రీతీ జింటా.. ఓ షోలో షారుఖ్‌ను ఇంటర్వ్యూ చేస్తూ .. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో షారుఖ్ .. మీరు ప్రెగ్నెంటా అని అడగ్గా ఆమె సిగ్గుపడుతూ ఫేస్‌ను కవర్ చేసుకుంటుంది. ఆ వెంటనే షారుఖ్ .. అయితే నేను నిన్ను ప్రెగ్నెంట్‌ను చేస్తా అని అనడంతో ప్రీతి షాక్‌కు గురై ఏం మాట్లాడాలో తెలియక నవ్వేసి కవర్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ సెలబ్రెటీ హోదాలో ఉండి , ఆల్రెడీ పెళ్లయిన పరాయి స్త్రీతో అలాంటి తప్పుడు మాటలేంటీ అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X