ప్రియుడి ద్వారా గర్భం దాల్చిన నటి, నీటి తొట్టిలో ప్రసవానికి ఏర్పాట్లు!

బాలీవుడ్లో క్యాష్, ఐ హేట్ లవ్ స్టోరీస్, దేశీ బాయ్స్, గ్రాండ్ మస్తీ, మస్తీ జాదె, జైహో చిత్రాలతో పాటు తమిళంలో బిల్లా 2లో నటించిన బ్రూనా అబ్దులా తన బాయ్ ఫ్రెండ్ అలెన్ ఫ్రాసర్ కారణంగా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఆమె కొన్ని రోజుల క్రితమే సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

డెలివరీ డైమ్ దగ్గర పడుతుండటంతో బ్రూనా అబ్దుల్లాలో ఎగ్జైట్మెంట్ మరింత ఎక్కువ అవుతోంది. ఓ ఆంగ్ల పత్రికతో ఆమె మాట్లాడుతూ... 'నేను మాతృత్వం గురించి ఎక్కువగా ఆలోచించలేదు, కానీ ఇప్పుడు నేను కుటుంబ మార్గంలో ఉన్నాను, మా బిడ్డను కలవడానికి నిజంగా వేచి ఉండలేకపోతున్నాను' అన్నారు.

 I would go for water birthing: Bruna Abdullah

బిడ్డను కనే సమయం దగ్గర పడుతుండటంతో అన్ని రకాలుగా సిద్ధమవుతున్నరట ఈ జంట. పుట్టబోయే బిడ్డ కోసం నర్సరీని కూడా డిజైన్ చేస్తున్నారు. డెలివరీ విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు, వాటర్ బర్త్ (నీటి తొట్టెలో ప్రసవం) ఆప్షన్ ఎంచుకున్నట్లు బ్రూనా వెల్లడించింది.

గర్భం దాల్చడం వల్ల సినిమాలు, బాలీవుడ్, ఇంకా చాలా మిస్పవుతున్నప్పటికీ... తల్లిని కాబోతున్నాననే ఆనందం అవన్నీ మరిచిపోయేలా చేస్తోందని తెలిపారు. త్వరలోనే బ్రూనా అబ్దులా నుంచి శుభవార్త వినబోతున్న ఫ్యాన్స్ ఆమెకు సుఖ ప్రసవం కావాలని విష్ చేస్తున్నారు.

పెళ్లికి ముందే ప్రియుడితో గర్భం దాల్చడం లాంటివి ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు... శ్రీదేవి లాంటి వారు సైతం ఇదే పద్దతి అనుసరించారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ ధోరణి బాలీవుడ్లో మరింత పెరిగిందనే చెప్పాలి. అమీ జాక్సన్ సైతం ప్రస్తుతం ఇదే పద్దతిలో గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. మరో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ సైతం తన గర్ల్ ఫ్రెండ్ గాబ్రియేలాను గర్భవతిని చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X