నిజమైన హీరో నువ్వే: అభినందన్‌కు స్వాగతం చెబుతూ సినీ స్టార్ల ట్వీట్స్

పాకిస్థాన్ సైన్యానికి చిక్కిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ శుక్రవారం సాయంత్రం తిరిగి ఇండియా చేరుకున్నారు. అభినందన్ క్షేమంగా తిరిగి రావడంతో భారతీయుల ముఖాల్లో సంతోషం వెల్లువిరిసింది.

ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలాకోట్ ప్రాంతంలో ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఆపరేషన్ తర్వాత పాకిస్థాన్ యుద్ధవిమానాలు భారత గగనతలంలోకి దూసుకురావడంతో వాటిని తరిమికొట్టడానికి మిగ్-21 బైనస్ యుద్ధ విమానంలో బయల్దేరిన అభినందన్... ఈ క్రమంలో తన విమానం పాక్ భూభాగంలో కూలిపోవడంతో అక్కడ సైన్యానికి చిక్కాడు. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో పాకిస్థాన్ ప్రభుత్వం అభినందన్ వర్ధమాన్‌ను క్షేమంగా వదిలిపెట్టింది.

పాక్ సైనికులకు చిక్కగానే తన వద్ద ఉన్న రహస్య పత్రాలు పాక్ ఆర్మీకి చిక్కకుండా వాటిని మింగివేసిన అభినందన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పాక్ సైనికాధికారులు భారత సైన్యానికి సంబంధించిన రహస్యాలు రాబట్టే ప్రయత్నం చేసినా అభినందన్ ఆ విషయాలేవీ బయట పెట్టకుండా దేశ ప్రజల దృష్టిలో హీరో అయ్యాడు.

అభినందన్‌కు వెల్ కం చెబుతూ దేశ ప్రజలంతా సంబరాల్లో మునిగిపోయారు. పలువురు బాలీవుడ్ తారలు సైతం ఈ ఎయిర్ ఫోర్స్ హీరోకు వెల్ కం చెబుతూ ట్వీట్ల వర్షం కురిపించారు.

ఇంతకంటే గొప్ప ఫీలింగ్ ఏదీ లేదు


ఇంటికి తిరిగి రావడం కంటే గొప్ప ఫీలింగ్ ఏదీ ఉండదు. మన ఇల్లు... ప్రేమ, నమ్మకం, కలలకు స్థానం. నీ ధైర్యం మమ్మల్ని మరింత స్ట్రాంగ్‌గా చేసింది. ఎంతో గొప్పగా ఫీలవుతున్నాం. వెల్ కం బ్యాక్ అభినందన్ అంటూ షారుక్ ఖాన్ ట్వీట్ చేశారు.

నువ్వు నిజమైన హీరో

వెల్ కం బ్యాక్ హోం అభినందన్. నువ్వు నిజమైన హీరో.. భారత్ మాతాకీ జై! అంటూ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ట్వీట్ చేశారు.

మై బ్రదర్ విత్ ఎ బ్లడ్డెడ్ నోస్

మై బ్రదర్ విత్ ఎ బ్లడ్డెడ్ నోస్.. అంటూ అభినందన్ సిస్టర్ అదితి రాసిన లెటర్ షేర్ చేస్తూ... ఆయనకు రెస్పెక్ట్‌తో గ్రాండ్ వెల్ కం చెప్పారు బాలీవుడ్ నటుడు అఫ్తాబ్ శివ్ దాసాని.

దియా మీర్జా

లవ్, రెస్పెక్టుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండ్ అభినందన్‌కు వెల్ కం చెబుతున్నాను. శాంతి నెలకొనాలి, మనకు యుద్ధం వద్దు అంటూ దియా మీర్జా ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X