IIFA Digital Awards 2025: కృతిసనన్ మూవీకి అవార్డుల పంట.. ఐఫా ఓటీటీ అవార్డ్స్ విజేతలు వీరే

భారతీయ చిత్ర పరిశ్రమలో నటీనటులు, సాంకేతిక నిపుణులను గౌరవించుకునేందుకు పలు అవార్డులు ఉన్నాయి. జాతీయ చలన చిత్ర అవార్డులకు తోడు పలు రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు ఇచ్చే పురస్కారాలు ఎన్నో. ఇక ఓటీటీల రాకతో ఈ విభాగానికి కూడా పురస్కారాలను ప్రకటిస్తున్నారు. తాజాగా 25వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు (ఐఫా) ఓటీటీ -2025 ప్రదానోత్సవం రాజస్థాన్ జైపూర్‌లో జరిగింది.

ఐఫా అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని భారతదేశంలో జరపడం ఇది రెండోసారి. ఐదేళ్ల క్రితం ముంబైలో ఈ కార్యక్రమం నిర్వహించగా.. ప్రతి ఏడాది భారత్‌కు వెలుపల అబుదాబి, సింగపూర్, మలేషియా, అమెరికా, దుబాయ్ తదితర వేదికల్లో నిర్వహించేవారు. అంతేకాదు.. ఈ ఏడాదితో ఐఫా అవార్డ్స్‌కు పాతికేళ్లు పూర్తి చేసుకోనుంది. 2000వ సంవత్సరంలో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జైపూర్‌లో జరిగిన ఐఫా వేడుకలకు హీరో కార్తీక్ ఆర్యన్, నిర్మాత కరణ్ జోహార్‌లు వ్యవహరించారు.

iifa digital awards 2025 winners complete list Here s the details

భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేసిన దిగ్గజ నటుడు , నిర్మాత దివంగత రాజ్ కపూర్‌కు ఈ కార్యక్రమంలో నివాళులర్పించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మహిళా నటులు ది జర్నీ ఆఫ్ ఉమెన్ ఇన్ సినిమా పేరుతో ప్రత్యేక సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ రంగంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. హీరోలకు తాము ఏమాత్రం తక్కువ కాదని, ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ పారితోషికం విషయంలో అసమానతలు కనిపిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శ్రద్ధా కపూర్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం స్త్రీ 2 గురించి ప్రస్తావన వచ్చింది. ఈ చిత్రం భారీ విజయం సాధించినప్పటికీ హీరోయిన్ శ్రద్ధాకపూర్‌కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో అందరికీ తెలిసిందేనంటూ వ్యాఖ్యానించారు. అందరం సమానంగా పనిచేసినప్పుడు పారితోషికం విషయంలో చాలా వ్యత్యాసం కొనసాగుతోందని చెప్పారు. హీరోలు ఈ విషయంలో తమకు అండగా నిలవాలని మహిళా నటులు కోరారు. ఇక ఐఫా అవార్డ్స్ వేడుకకు బాలీవుడ్ సెలబ్రెటీలు, ఇతర రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఉత్తమ చిత్రంగా అమర్ సింగ్ చంకీలా, ఉత్తమ నటుడిగా విక్రాంత్ మస్సే, ఉత్తమ నటిగా కృతిసనన్ అవార్డులను అందుకున్నారు.

ఐఫా అవార్డ్స్ (ఓటీటీ) - 2025 విజేతలు వీరే :

సినిమా కేటగిరీ :

బెస్ట్ మూవీ : అమర్ సింగ్ చంకీలా
బెస్ట్ యాక్టర్: విక్రాంత్ మశ్శే (సెక్టార్ 36)
ఉత్తమ నటి: కృతి సనన్ (దో పత్తి)
బెస్ట్ డైరెక్టర్ : ఇంతియాజ్ ఆలీ (అమర్ సింగ్ చంకీలా)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : దీపక్ (సెక్టార్ 36)
ఉత్తమ సహాయ నటి: అనుప్రియా గోయంకా (బెర్లిన్)

వెబ్ సిరీస్ :

బెస్ట్ స్టోరీ : కనికా ధిల్లాన్ (దో పత్తి)
బెస్ట్ వెబ్ సిరీస్ : పంచాయత్ సీజన్ 3
బెస్ట్ యాక్టర్ : జితేంద్ర కుమార్ (పంచాయత్ సీజన్ 3)
ఉత్తమ నటి: శ్రేయాచౌదరి (బందీశ్ బందిట్స్ సీజన్ 2)
బెస్ట్ డైరెక్టర్ : దీపక్ కుమార్ మిశ్రా (పంచాయత్ సీజన్ 3)
ఉత్తమ కథ: కోటా ఫ్యాక్టరీ సీజన్ 3
బెస్ట్ రియాల్టీ సిరీస్: ఫ్యాబ్యులెస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్
బెస్ట్ డాక్యుమెంటరీ : యో యో హనీ సింగ్: ఫేమస్
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : ఫైజల్ మాలిక్ (పంచాయత్ సీజన్ 3)
ఉత్తమ సహాయ నటి: సంజిదా షేక్ (హీరామండి: ది డైమండ్ బజార్)

More from Filmibeat

Read more about: kriti sanon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X