చాలా మందితో డేటింగ్ చేశా.. ఎవ్వరూ నా కోరిక తీర్చలేదు.. ఆ ముగ్గురితోనే నాకు లింకు: ఇలియానా

Recommended Video

Ileana D’Cruz Opens Up About Her Dating || ఆ ముగ్గురితోనే నాకు లింకు

దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఇలియానా డీ క్రజ్ ఇప్పుడు బాలీవుడ్‌పైనే ఆశలు పెట్టుకొన్నది. టాలీవుడ్‌కు దూరమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్‌లో స్థిరపడటానికి తంటాలు పడుతున్నది. తాజాగా ది లవ్ లాఫ్ లైవ్ షో కార్యక్రమంలో పాల్గొన్న ఇలియానా తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. యాక్టింగ్ జీవితంపై ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అవేమిటంటే..

తెలుగులో టాప్ హీరోయిన్‌గా

తెలుగులో టాప్ హీరోయిన్‌గా

తెలుగులో దేవదాసుతో కెరీర్‌ను ఆరంభించిన ఇలియానా.. ఆ తర్వాత ఆమె కెరీర్‌ రివ్వున తారాస్థాయికి దూసుకెళ్లింది. పలు అగ్రహీరోలతో జతకట్టి ఆకట్టుకొన్నది. ఆ తర్వాత బర్ఫీ సినిమాతో బాలీవుడ్ చిత్ర రంగానికి పరిచయమైంది. ఆతర్వాత రుస్తుం, మై తేరా హీరో, ముబారక్, బాద్షాహో, రైడ్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నది.

 హీరోయిన్ కావాలనే కోరిక లేదు

హీరోయిన్ కావాలనే కోరిక లేదు

తాజాగా ది లవ్ లాఫ్ లైవ్ షో‌లో నటి శిభానీ దండేకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం లేదు. హీరోయిన్‌ కావాలనే కోరికలేదు. కానీ యాక్సిడెంట్‌గా నేను తెరపైన మెరిసాను. వాస్తవానికి నేను సింగర్ కావాలనుకొన్నాను. కానీ విధి మరోలా తలిచి నన్ను యాక్టర్‌ను చేసింది అని యాక్టింగ్ కాకపోతే మరే రంగాన్ని ఎంచుకొంటారనే ప్రశ్నకు ఇలియానా అలా స్పందించింది.

నేచురల్‌గా ఉండటానికే

నేచురల్‌గా ఉండటానికే

నేను నేచురల్‌గానే ఉండటానికి ఇష్టపడుతాను. ఫోటోలు దిగితే ఎలాంటి మార్పులు చేయను. హంగులు అద్దను.. నేను నేచురల్‌గా కనిపించాలని అనుకొంటాను. అందుకే ఫొటోషాప్.. మొబైల్‌లో ఫిల్టర్లు వాడను. సహజసిద్ధంగా నేను ఫొటోలలో కనిపించాలని భావిస్తాను. కృతిమ పద్దతుల్లో నేను ఎదుటి వారిని మోసగించడం నాకు ఇష్టం ఉండదు అని ఇలియానా పేర్కొన్నది.

 చాలా మందితో డేటింగ్

చాలా మందితో డేటింగ్

నాకు పూలు అంటే చాలా ఇష్టం. నేను చాలా మందితో డేటింగ్ చేశాను. కానీ ఎవరి నుంచి పుష్ఫగుచ్చాలు పొందలేదు. నా బాయ్‌ఫ్రెండ్ ఎవరు కూడా నాకు అలాంటి గిఫ్టులు ఇవ్వలేదు. నాకు గుర్తున్న వరకు నా తండ్రి నుంచి పూలతో కూడిన ఓ గిఫ్టును మాత్రమే అందుకొన్నాను. అంతకుమించి మరొకరు నాకు గిఫ్టులు అందించలేదు అని ఇలియానా తెలిపింది.

ఆ ముగ్గురితోనే లింకు

ఆ ముగ్గురితోనే లింకు

బాలీవుడ్‌లో ఎవరితో నటించడమంటే ఇష్టం అని శిభానీ అడిగిన మరో ప్రశ్నకు ఇలియానా సమాధానం ఇస్తూ.. హీరోయిన్ నర్గీస్ ఫక్రీ అంటే ఇష్టం. ఆమెతో నాకు చక్కటి అనుబంధం ఉంది. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. నర్గీస్ కాకుండా నాకు యాక్టర్ అర్షద్ వార్సీ, వరుణ్ ధావన్‌తో మంచి రిలేషన్ ఉంది అని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X