»   » అతడి వల్ల గర్భం వచ్చుంటే ఆనందపడేదాన్ని: హీరోయిన్ షాకింగ్ కామెంట్

అతడి వల్ల గర్భం వచ్చుంటే ఆనందపడేదాన్ని: హీరోయిన్ షాకింగ్ కామెంట్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చిన్న వయసులోనే నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడమే కాదు... సౌత్‌లో స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగింది ఇలియానా. ప్రస్తుతం బాలీవుడ్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతోంది. ఇలియానా కొన్ని రోజులుగా ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. అతడితో సహజీవనం చేస్తున్న ఇలియానా గర్భం దాల్చినట్లు కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ వార్తలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఇలియానా స్పందించారు. ఈ విషయమై ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు.

   గర్భం వచ్చుంటే ఆనందపడేదాన్ని: ఇలియానా

  గర్భం వచ్చుంటే ఆనందపడేదాన్ని: ఇలియానా

  ‘నేను గర్భం దాల్చలేదు. ఒక వేళ అలా జరిగి ఉంటే నేను మరింత ఆనందంగా ఉండేదాన్ని అంటూ ఎవరూ ఊహించని సమాధానం చెప్పింది. ఇప్పట్లో గర్భం దాల్చే ఆలోచన లేదని, దానికి ఇంకా సమయం ఉందని ఇలియానా తెలిపారు.

   పెళ్లి గురించి అడిగితే తిక్క సమాధానాలు చెప్పి ఇల్లీ బేబీ

  పెళ్లి గురించి అడిగితే తిక్క సమాధానాలు చెప్పి ఇల్లీ బేబీ

  ఇలియానా, ఆండ్రూకు పెళ్లయినట్లు కూడా ఆ మధ్య వార్తలు వినపించాయి. ఈ వార్తలపై వివరణ ఇవ్వాలని కోరగా.... ఇలియానా తిక్క సమాధానాలు ఇచ్చింది. నాకు పెళ్లి జరిగిందా? లేదా? అనేది ప్రపంచానికి చెప్పడం అంత ముఖ్యమని అనుకోవడం లేదు. ఏ విషయం ఎప్పుడూ చెప్పాలో నాకు బాగా తెలుసు అని డొంకతిరుగుడు సమాధానాలు ఇవ్వడం ద్వారా తన వ్యక్తిగత జీవితంలోకి మీడియా తొంగి చూడొద్దు అంటూ చెప్పకనే చెప్పింది ఈ గోవా బ్యూటీ.

  ఇలియానా బాలీవుడ్ కెరీర్

  ఇలియానా బాలీవుడ్ కెరీర్

  సౌత్‌లో సక్సెస్‌ఫుల్ కెరీర్ కొనసాగించిన ఇలియానా.... భారీ ఆశలతో బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అయితే అక్కడ అనుకున్న స్థాయిలో ఆమె కెరీర్ ముందుకు సాగడం లేదనే చెప్పాలి. దీంతో ఆమె చాలా డిప్రెషన్లో ఉందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి.

  బాయ్ ఫ్రెండుతో ఫిజిలో విహరిస్తున్న ఇలియానా

  బాయ్ ఫ్రెండుతో ఫిజిలో విహరిస్తున్న ఇలియానా

  ఫిజీ దేశ టూరిజానికి ఇలియానా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చేతిలో పెద్దగా సినిమాలు కూడా లేక పోవడంతో బాయ్ ఫ్రెండును వెంటేసుకుని ఫిజీ దేశంలోని వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది.

  రవితేజ సినిమాతో టాలీవుడ్ రీ ఎంట్రీ

  రవితేజ సినిమాతో టాలీవుడ్ రీ ఎంట్రీ

  2012లో ‘దేవుడు చేసిన మనుషులు' తర్వాత ఇలియానా తెలుగులో ఏ సినిమా చేయలేదు. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఆమె తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం.

  English summary
  "I'm not pregnant. In fact, I would have been super happy if I was. It's something I have always wanted. But there's still time. I still don't want to become pregnant yet," Ileana told IANS during her Fiji sojourn as brand ambassador, laughing off rumours.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more