ఇలియానా ఫిగర్‌పై దారుణమైన కామెంట్.. తింగరి నోరు మూయించిన బ్యూటి!

By Rajababu

Recommended Video

Ileana Gives Strong Reply to Fans

టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బిజీగానే కనిపిస్తున్నారు. ఇటీవల తన అకౌంట్‌లో 'మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఓ ప్రశ్న అడగండి' అనే నెటిజన్లను, ఫ్యాన్స్‌ను కోరింది. అయితే ఇలియానా ప్రశ్న అడగమంటే జనం ఊరుకొంటారు. తింగిరి తింగిరి ప్రశ్నలతో కోపం తెప్పించే ప్రయత్నం చేశారు. అయితే తనదైన శైలిలో సమాధానం చెప్పి సదరు వ్యక్తి నోరుమూయించింది ఇలియానా.. ఇంతకు నెటిజన్ అడిగిన ప్రశ్న ఏమిటంటే..

ఇలియానాను ఇబ్బంది పెట్టేందుకు

ఇలియానాను ఇబ్బంది పెట్టేందుకు

మీకు వికృతమైన శరీరం ఉన్నందుకు ఎప్పుడైనా బాధపడ్డారా? అని ఇలియానాను నెటిజన్ ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ప్రశ్నకు చిరాకు పడకుండా ఇలియానా సుతిమెత్తగా ఆ వ్యక్తికి సమాధానం ఇచ్చారు. ఆ వ్యక్తికి ఎలాంటి సమాధానం ఇచ్చారంటే..

నాకు వికృతమైన బాడీ

నాకు వికృతమైన బాడీ

ముందుగా మీకు ఓ మాట చెప్పాలనుకొంటున్నాను. నాకు చెత్త, వికృతమైన శరీరం లేదు. ఇంతవరకు ఇలాంటి మాట ఎవరూ చెప్పలేదు అని ఇలియానా అన్నారు. ఇక మీ ప్రశ్నకు రెండో జవాబు ఏమిటంటే.. నా బాడీ షేప్ చూసి కొందరు విమర్శించారు. అలా అన్నందుకు నేను పెద్దగా బాధపడలేదు. నా దేహంపై మక్కువను పెంచుకొన్నాను. ఎవరో ఏదో అన్నారని నా తీరు మార్చుకోలేను అని గట్టిగా సమాధానం చెప్పింది.

విశ్వాసం కోల్పోయాను

విశ్వాసం కోల్పోయాను

ఇలియానాకు మరో వ్యక్తి మరో ప్రశ్న వేశారు. ఇలియానా గారు.. నేను చాలా బక్క పలుచగా ఉంటాను. దాంతో నాపై నేను విశ్వాసం కోల్పోయాను. తిరిగి దానిని ఎలా తెచ్చుకోవాలి అని అడిగారు. అందుకు ఇలియానా చాలా చక్కటి సమాధానం ఇచ్చారు.

అందానికి ప్రమాణాలు లేవు

అందానికి ప్రమాణాలు లేవు

మీరు ముందుగా ఓ విషయం తెలుసుకోవాలి. మీ మాదిరిగా మరొకరు ఉండరు. ప్రతీ ఒక్కరు విభిన్నమైన దేహాన్ని కలిగి ఉంటారు. అందానికి శాశ్వతమైన ప్రమాణాలు ఉండవు. మీకు ఉన్న దానినితో సంతృప్తి చెందాలి. మరొకరిని చూసి పోల్చుకోవద్దు. ఉండాలని ప్రయత్నించకు. అద్దంలో ఓ సారి చూసుకో నీ అందంలో ఏదో ఒకటి నీకు ఇష్టమైన భాగం కనిపిస్తుంది. అదే నీ దేహానికి ఆకర్షణ అని తెలుసుకో అని ఇలియానా సమాధానం ఇచ్చింది.

రవితేజతో అమర్ అక్బర్ ఆంథోని

రవితేజతో అమర్ అక్బర్ ఆంథోని

ఇలియానా టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో జతకట్టింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందే అమర్ అక్బర్ ఆంథోని అనే చిత్రంలో జంటగా నటిస్తున్నారు. హిందీలో అజయ్ దేవగన్‌తో నటించిన రైడ్ చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. సుమారు రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X