సల్మాన్ ఖాన్ అడిగినా నో చెప్పిన ఇలియానా.. గోవా బ్యూటీకి మంచి చాన్స్ మిస్
గోవా సుందరి ఇలియానా.. టాలీవుడ్‌లో స్టార్ డమ్‌ను ఎంజాయ్ చేస్తుండగా బాలీవుడ్‌కు చెక్కేసింది. ఇక్కడ వరుస విజయాలు అందుకుంటూ.. ఊపిరి సలపనంత బిజీగా ఉన్న ఇలియానా బాలీవుడ్‌కు వెళ్లి ఖాళీగా కూర్చున్నట్టైంది. అక్కడ ఆశించిన మేర విజయాలు అందుకోలేక వెనుకబడిపోయింది. మళ్లీ ఇక్కడికి వచ్చి ప్రయత్నించినా.. సరైన సక్సెస్ లేక మళ్లీ తిరుగు పయనం చేసింది. అడపాదడపా చిత్రాలు చేస్తూ వస్తోన్నా కూడా మంచి హిట్ కొట్టి మునుపటి స్టార్ స్టేటస్‌ను సంపాదించుకోలేకపోతోంది.

వరుస హిట్లతో జోరు..
దేవదాస్, పోకిరి, జల్సా, కిక్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది ఇలియానా. అయితే తెలుగు చిత్ర సీమలో ఓ ఊపు ఊపుతున్న తరుణంలోనే బాలీవుడ్‌పై మనసు పారేసుకుంది. అయితే అక్కడ మాత్రం ఈ అమ్మడి ఆశలు నెరవేరలేదు. ఎన్ని సినిమాలు చేసినా.. ఒక్క కమర్షియల్ సక్సెస్ కూడా కొట్టలేకపోయింది.

రీమేక్ చిత్రాలతో సల్మాన్ జోరు..
తెలుగు చిత్రాలను హిందీలో రీమేక్ చేసి తిరుగు లేని క్రేజ్ తెచ్చుకున్నాడు సల్మాన్ ఖాన్. పోకిరి చిత్రాన్ని వాంటెడ్‌గా, రెడీ, కిక్ చిత్రాలను అవే పేర్లతో రీమేక్ చేసి మంచి విజయాలను అందుకున్నాడు. అయితే ఈ మధ్య వీటికి సంబంధించిన ఓ విషయం బయటకు రావడంతో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.
Recommended Video

ఆ రెండు చిత్రాల్లోనూ ఇలియానే..
సల్మాన్ కెరీర్‌లో వాంటెడ్, కిక్ చిత్రాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. వాంటెడ్ చిత్రం సల్మాన్ సినీ కెరీర్‌ను నిలబెట్టగా.. కిక్ చిత్రం భారీ హిట్ కొట్టి సల్మాన్ స్టామినాను మరోసారి నిరూపించింది. ఈ రెండు సినిమాలు కూడా ఇలియానా నటించిన తెలుగు చిత్రాలకు రీమేకే. అయితే హిందీలో మాత్రం ఆ అవకాశాలను చేజేతులా కాదనుకుందట.

పిలిచి మరీ అవకాశం..
పోకిరి, కిక్ చిత్రాల్లో ఇలియానా నటనను చూసి తాను చేయబోయే రీమేక్‌లోనూ ఇలియానాను అడిగాడట. వాంటెడ్ సమయంలో తాను పరీక్షలు రాస్తున్నందున, కిక్ టైమ్‌లో డేట్లు అడ్జస్ట్ చేయలేక మంచి చాన్స్‌లు మిస్ చేసుకున్నట్లు ఇలియానా చెప్పుకొచ్చింది. మొత్తానికి ఇలియానా రెండు గోల్డెన్ చాన్స్‌లు మిస్ చేసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











