ఇలియానాని వాడుకున్నట్లు ఇంకెవరిని వాడుకోవడం లేదట.. మోస్ట్ డేంజరస్!
హాట్ బ్యూటీ ఇలియానా ఒకప్పుడు సౌత్ లో టాప్ హీరోయిన్. టాలీవుడ్ ని వదలి బాలీవుడ్ కు వెళ్లిన తరువాత ఆమెకు అవకాశాలు బాగా తగ్గాయి. అప్పుడప్పుడూ కొన్ని చిత్రాల్లో నటిస్తూ ఫోటో షూట్స్ తో కాలం గడిపింది. తాజాగా ఓ సర్వేలో ఇలియానా ఇండియాలోనే టాప్ సెలేబ్రిటిగా నిలిచింది. అది కూడా ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనెని వెనక్కి నెట్టి మరీ టాప్ పొజిషన్ కు చేరుకోవడం విశేషం.

మొదటి స్థానంలో
ప్రతి ఏడాది అమెరికాకు చెందిన మెక్ అఫీ అనే సంస్థ ఇండియాలోని మోస్ట్ డేంజరస్ సెలెబ్రిటీల జాబితాని విడుదల చేస్తుంది. ఈ ఏడాదికి సంబందించిన జాబితాని విడుదల చేయగా ఇలియానా మొదటి స్థానంలో నిలిచింది. ఇలియానా తరువాత స్థానాలలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె, ప్రీతి జింత వంటి స్టార్లు నిలిచారు.
Recommended Video


మోస్ట్ డేంజరస్ సెలెబ్రిటీ
ఇది ఇలియానా సాధించిన ఘనత అని భావిస్తే పొరపాటే. సైబర్ నేరాలని దృష్టిలో పెట్టుకుని మెక్ అఫీ సంస్థ ఈ సర్వే నిర్వహిస్తుంది. వీరి సర్వే ప్రకారం సైబర్ నేరగాళ్లు, హ్యాకర్స్ ఎక్కువసార్లు వాడుకున్న సెలెబ్రిటీ మొదటి స్థానంలో నిలుస్తారు. అంటే ఆ రేంజ్ లో ఇలియానాని సైబర్ నేరగాళ్లు వాడుకుంటున్నారన్నమాట.

కవ్వించేలా
ఇలియానా, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె వంటి సెలెబ్రిటీల కవ్వించే ఫొటోలతో వివిధ రకాల మాల్వేర్ అటాక్స్ జరిపి హ్యాకింగ్ కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. నెటిజన్లని అలెర్ట్ చేయడం కోసమే మెక్ అఫీ సంస్థ ప్రతి ఏడాది ఈ సర్వే నిర్వహిస్తుంది.

రవితేజ చిత్రంలో
ఇక సినిమాల విషయానికి వస్తే ఇలియానా చాలా కాలం తరువాత తెలుగు చిత్రంలో నటిస్తోంది. రవితేజ సరసన ఇలియానా అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనువైట్ల దర్శత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











