వైవాహిక జీవితం దుర్భరం.. విడాకులు మరీ నరకం.. అమీర్ ఖాన్ ఫ్యామిలీలో పేలిన ట్రూత్ బాంబ్
బాలీవుడ్ మీడియాలో గత కొద్దికాలంగా అమీర్ ఖాన్ మేనల్లుడు, నటుడు ఇమ్రాన్ ఖాన్ దాంపత్య జీవితంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. భార్య అవంతిక మాలిక్‌తో వైవాహిక జీవితం కష్టాల్లో పడిందనే వార్తలు వైరల్ అయ్యాయి. ఆ ఊహాగానాలకు బలం చేకూర్చే విధంగా ఇమ్రాన్ ఖాన్ భార్య అవంతిక సోషల్ మీడియా పోస్టు క్లారిటీ ఇచ్చింది. తమ దాంపత్య జీవితంలో ట్రూత్ బాంబు పేలిందంటూ ఆమె భావోద్వేగంతో పోస్ట్ చేయడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. అవంతిక మాలిక్ చేసిన సోషల్ మీడియా పోస్టు ప్రకారం..

నా స్థూలకాయమే వైవాహిక జీవితానికి అడ్డంకిగా
వైవాహిక జీవితం దుర్భరం.. విడాకులు మరింత దుర్భరంగా మారింది. ఆ చేదు నిజాలను దిగమింగడం అత్యంత దుర్భంగా మారింది. నా స్థూలకాయ సమస్య జీవితాన్ని మరింత దుర్భరంగా మార్చింది. ఫిట్‌గా మారడానికి చేసిన ప్రయత్నాలు మరింత దుర్బరమయ్యా. ఇలాంటి కష్టాలను ఆమోదించడం చాలా కష్టంగా మారింది అంటూ అవంతిక తన పోస్టులో పేర్కొన్నారు.

జీవితంలో ఎప్పుడు.. ఎలాంటి పరిస్థితులు
జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో చెప్పడం కష్టం. ఆ సమస్యల వల్ల భార్యభర్త మధ్య బంధాలు మరి ఇలా కష్టవుతాయని, వాటిని పరిష్కరించుకోవడానికి అలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావడం ఇంత కష్టమవుతాయని ఊహించలేదు. నా జీవితంలో చోటుచేసుకొన్న విషయాలను జీర్ణించుకోవడం మరీ కష్టంగా మారింది అంటూ అవంతిక తన పోస్టుతో భావోద్వేగానికి గురయ్యారు.

కష్టాలు ఎదురైన సమయంలో
కష్టాలు ఎదురైనప్పుడు వాటిని స్వయంగా పరిష్కరించుకొనే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో నాకు నేను సఫలమయ్యాను. కష్టాలను ఎదురించి సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాను. కొన్ని ఇబ్బందులను పెద్దగా పట్టించుకోకుండా జీవితాన్ని ముందుకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేశాను అని అవంతిక తన పోస్టులో వెల్లడించారు.

ఇమ్రాన్ ఖాన్‌తో విడాకులపై క్లారిటీ
గత కొద్దికాలంగా గుట్టుగా సాగుతున్న విడాకుల వ్యవహారాన్ని అవంతిక బయటపెట్టారు. ఇమ్రాన్ ఖాన్‌తో విడాకులు అయినట్టు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. తన విడాకులకు కారణం తన స్థూలకాయం, ఆరోగ్య సమస్యలే ప్రధాన కారణమని చెప్పడం గమనార్హం. ఆమె తన పోస్టులో ప్రముఖ రచయిత డెవాన్ బ్రో కొటేషన్స్ ఉపయోగిస్తూ అత్యంత భావోద్వేగానికి గురయ్యారు.
Recommended Video

ఇమ్రాన్ ఖాన్, అవంతిక వైవాహిక జీవితం
అమీర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్ తన బాల్య స్నేహితురాలు, అప్పటి సీఎన్‌బీసీ-టీవీ18 సీఈవో వందనా మాలిక్ కూతురు అవంతికా మాలిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వారికి అబ్బాయి ఉన్నారు. ఆ తర్వాత వ్యక్తిగత విభేదాలు తలెత్తడంతో వారిద్దరూ విడిపోయారు. దాంతో తొమ్మిదేళ్ల వైవాహిక జీవితానికి తెరపడింది.


Click it and Unblock the Notifications











