ముగ్గురు హీరోయిన్లపై దర్శకుడి అకృత్యాలు.. దారుణంగా వేధింపులు.. అమీర్ అల్లుడి సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, క్వీన్ దర్శకుడు వికాల్ బెహల్ అకృత్యాలపై ఒక్కొక్కరు నోరు విప్పుతున్నారు. ఆయన లైంగిక వేధింపులు వ్యవహారంపై బాహటంగా మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. 2015లో పాంథమ్ ఫిలింస్ బ్యానర్‌లో దర్శకుడు అనురాగ్ కశ్యప్ రూపొందించిన సినిమా ప్రమోషన్‌లో వికాస్ తనను లైంగిక వేధించాడని ఓ నటి ఆరోపణలు చేయడం వివాదంగా మారింది. ఈ వివాదంపై మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌ కూడా వికాస్ బెహల్‌పై సంచలన విషయాలు వెల్లడించారు. వికాస్ రాసలీలల గురించి నాకు ముందే తెలుసు అని ఆయన వెల్లడించడం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

వికాస్ బెహల్ అకృత్యాలపై

వికాస్ బెహల్ అకృత్యాలపై

దర్శకుడు వికాస్ బెహల్ అకృత్యాల గురించి ముగ్గురు హీరోయిన్లు నాకు చెప్పారు. శరీరంలోని ప్రైవేట్ భాగాలను తాకేవాడు. నీకు సినిమాలో అవకాశం ఇస్తే, రిటర్న్‌లో నాకు ఏమిస్తావు అని ముఖం మీదే అడిగేవాడు. అప్పుడే వికాస్‌పై వారు ఫిర్యాదు చేస్తామని అన్నారు. కానీ మీడియాకు ఎక్కడం వల్ల ఏం ఉపయోగం ఉండదని నేనే ఆపాను అని ఇమ్రాన్ తెలిపారు.

 పబ్లిసిటీ కోసమే ఇలా

పబ్లిసిటీ కోసమే ఇలా

వికాస్‌పై మీరు ఫిర్యాదు చేస్తే పబ్లిసిటీ కోసమే చేస్తున్నారని అనుకొంటారు. సినిమాలు ఆడకపోవడం, ఆఫర్ల రాకపోవడం వల్లే ఇలాంటి ట్రిక్స్‌కు పాల్పడుతున్నారని అందరూ అనుకొంటారు. సరైన సమయం కోసం వేచి చూసి అప్పుడు ఫిర్యాదు చేయవచ్చు అని ముగ్గురు హీరోయిన్లకు తాను చెప్పినట్టు ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు.

ధైర్యంగా ముందుకు రావడం

ధైర్యంగా ముందుకు రావడం

తమపై జరుగుతున్న లైంగిక ఆరోపణలపై హీరోయిన్లు ధైర్యంగా ముందుకొచ్చి బాహాటంగా ఆరోపణలు చేయడం శుభపరిణామం. ఈ నేపథ్యంలో మౌనంగా ఉండటం భావ్యం కాదని అనుకొంటున్నాను. నాకు తెలిసిన విషయాలు బయటకు చెప్పడం సరైందని భావిస్తున్నాను. బాధిత హీరోయిన్లకు హీరోలు అండగా నిలువడం లేదనే మాట రాకుండా బయటకు వచ్చాను అని ఇమ్రాన్ పేర్కొన్నారు.

మీటూ ఉద్యమానికి ఊపు

మీటూ ఉద్యమానికి ఊపు

విలక్షణ నటుడు నానా పాటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో బాలీవుడ్‌లో మీటూ ఉద్యమం ఊపందుకొన్నది. ఆ తర్వాత వికాస్ బెహల్, అలోక్ నాథ్ తదితర నటులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం సినిమా పరిశ్రమలోనే కాకుండా మీడియాలో కూడా లైంగిక ఆరోపణల వివాదాలు చోటుచేసుకోవడం సంచలనం రేపుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X