twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్కడ నగ్నంగా తిరిగినా నో రేప్, మన దేశంలో ఏమిటీ దారుణాలు: హీరోయిన్ కామెంట్

    |

    భారత దేశంలో క్రమ క్రమంగా రేప్ కల్చర్ పెరిగిపోతోందని, ఉన్నావో లాంటి రేప్ సంఘటనలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు అంటూ వ్యాఖ్యానించారు బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా. దేశంలో సంస్కారి కల్చర్ పేరుకే తప్ప దాన్ని ఎవరూ పాటించడం లేదన్నారు. మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు, సామూహిక హత్యాచారాలు, ఆడ శిశువు హత్యలు, కట్నం కోసం భార్యలను తగలబెట్టడం, రేప్ చేసిన తర్వాత అత్యంత పాశవికంగా చంపేయడం లాంటివి ప్రతి రోజూ వింటున్నాం. ఈ మధ్య కాలంలో కుక్కలు, మేకలపై కూడా హత్యాచారాలు జరుగుతున్నాయి. పైకి కనిపించేది సంస్కారి కల్చర్... కానీ ఇక్కడ కొందరి మైండ్లో అన్నీ తప్పుడు ఆలోచనలే అని చెప్పుకొచ్చారు.

    అక్కడ నగ్నంగా తిరిగినా నో రేప్..

    అక్కడ నగ్నంగా తిరిగినా నో రేప్..

    మన దగ్గర ఇలాంటి పరిస్థితి పెట్టుకుని... మహిళలు బికినీలు, షార్ట్స్ వేసుకుని తిరిగగే దేశాల్లో కల్చర్‌ను మనం తప్పుబడుతున్నాం. కొన్ని దేశాల్లోని బీచుల్లో మహిళలు నగ్నంగా తిరిగే అవకాశం కూడా ఉంది, కానీ అక్కడ ఎక్కడా కూడా అత్యాచారాలు జరుగడం లేదు, వారిని టీజ్ చేసిన సంఘటనలు కూడా లేవు.... అని తనుశ్రీ దత్తా తెలిపారు.

    ఇక్కడ అన్నీ కప్పుకుని తిరుగుతున్నా...

    ఇక్కడ అన్నీ కప్పుకుని తిరుగుతున్నా...

    మన దేశంలో సంస్కారి కల్చర్ పేరుతో అన్నీ కప్పుకుని తిరుగుతున్నా మహిళలపై, చిన్న పిల్లలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రాను రాను ఇలాంటి సంఘటనలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని తనుశ్రీ దత్తా చెప్పుకొచ్చారు.

    మనుషుల ఆలోచన మరాలి

    మనుషుల ఆలోచన మరాలి

    మన దేశంలో ఇలాంటి పరిస్థితి మారాలంటే... మనుషుల ఆలోచనలు మారాలి. మహిళలు వేసుకునే దుస్తుల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయనేది నిజం కాదు. వారు ఎలాంటి దుస్తులు వేసుకున్నా వారిని ఒక మహిళగా గౌరవించే కల్చర్ పెరిగినపుడే పరిస్థితిలో మార్పు వస్తుంది... అని తనుశ్రీ దత్తా వ్యాఖ్యానించారు.

    తను శ్రీదత్తా

    తను శ్రీదత్తా

    పదేళ్ల క్రితం ఓ బాలీవుడ్ మూవీ సెట్లో నటుడు నానా పాటేకర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన విషయాన్ని బయట పెట్టడం ద్వారా ‘మీటూ' ఉద్యమం ఇండియాలో ఉవ్వెత్తున ఎగసిపడేలా చేసిన తనుశ్రీ దత్తా... ఇప్పటికీ తన పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో దేశంలో మహిళలపై పెరిగిపోతున్న లైంగిక నేరాల అంశంపై ఆమె తనదైన శైలిలో స్పందించారు.

    English summary
    "Our great nation India has been slowly and steadily turning into a Rape epidemic afflicted country! The Unnao rape case and the unfoldment of it a horrific reminder of the state of affairs," said Tanushree in an interview with IANS.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X