ఆ హీరో తప్పుకోలేదు.. కమల్ 'ఇండియన్ 2' పై క్లారిటీ!
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'ఇండియన్ 2'. తెలుగులో భారతీయుడు 2 పేరుతో రూపొందుతోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కొన్ని నెలల క్రిందట ఓ వార్త వినిపించింది.
కానీ ఊహించని విధంగా అజయ్ దేవగన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. నిజానికి 'ఇండియన్ 2' సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సిఉంది. కానీ కొన్ని సమస్యల కారణంగా షూటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో అజయ్ దేవగన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని, ఆయన స్థానంలో అనిల్ కపూర్ విలన్ రోల్ చేయబోతున్నాడనే ప్రచారం మొదలైంది.

అనిల్ కపూర్ కూడా ఇటీవలే చెన్నై వెళ్లినప్పుడు శంకర్‌ను కలవడం ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చింది. దీంతో అజయ్ దేవగన్ స్థానాన్ని అనిల్ కపూర్ కొట్టేశాడని అనుకున్నారంతా. కానీ తమిళ సినీ వర్గాల నుండి తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఇది నిజం కాదని, ఇండియన్ 2 సినిమాలో విలన్ పాత్ర పోషించేది అజయ్ దేవగనే అని తెలుస్తోంది.
గతంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వల్ గా రాబోతున్న ఈ సినిమాలో సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, విద్యుత్ జమ్వాల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచే దేశవ్యాప్తంగా జనాల్లో క్యూరియాసిటీ నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తికాగానే తమిళనాడు లోని శ్రీపెరంబుదూరులో తదుపరి షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


Click it and Unblock the Notifications











