Cannes 2024: చరిత్ర సృష్టించిన అనసూయ.. ఇండియాలోనే ఫస్ట్ లేడీగా రికార్డు

కేన్స్ నగరంలో ప్రతి సంవత్సరం ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తుంటారన్న విషయం తెలిసిందే. ఇలా 76 వసంతాలను పూర్తి చేసుకుని ఇప్పుడు 77వ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహకులు జరుపుతున్నారు. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా సినిమా ఇండస్ట్రీల నుంచి రూపొందిన చిత్రాలను ప్రదర్శించి.. అందులోని నటులు, టెక్నీషియన్లకు అవార్డులను అందిస్తుంటారు.

77వ ఫిల్మ్ ఫెస్టివల్‌ కూడా గతంలో జరిగిన వాటి మాదిరిగానే ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతోంది. దీనికి ఈ ఏడాది భారత్ తరుపు నుంచి ఐశ్వర్య‌రాయ్ బచ్చన్ తో పాటు కియారా అద్వానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, శోభితా ధూళిపాళ్ల వెళ్లారు. వీళ్లతో పాటు ఎంతో మంది హాలీవుడ్ నటీమణులు తమ అందచందాలతో వీక్షకులను మెప్పించే ప్రయత్నాలు చేశారు.

Indian actress Anasuya Sengupta made history at Cannes 2024

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తాజాగా భారతదేశానికి చెందిన నటి అనసూయ సేన్‌గుప్త చరిత్రను సృష్టించారు. ఆమె 'అన్ సర్టెయిన్ రిగార్డ్' విభాగంలో ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. తద్వారా ఈ ప్రతిష్టాత్మక చిత్రోత్సవంలో ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న తొలి భారతీయ మహిళగా అనసూయ నిలిచారు. దీంతో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

బల్గేరియన్‌ డైరెక్టర్ కాన్ స్టాంటిన్ బొజనోవ్ 'ది షేమ్ లెస్ ' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలోని నటనకు గానూ అనసూయకు ఈ అవార్డు దక్కింది. ఈ మూవీలో ఆమె 'రేణుక' అనే వేశ్య పాత్రను పోషించారు. ఈ చిత్రం భారత్, నేపాల్‌లో నెలన్నర రోజుల పాటు చిత్రీకరించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ఎంపికై ప్రదర్శనకు వచ్చింది. అందులో ఆమె నటనకు ఫిదా అయినా జ్యూరీ మెంబర్లు ఉత్తమ నటి అవార్డుకు ఎంపిక చేశారు.

Indian actress Anasuya Sengupta made history at Cannes 2024

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాకు చెందిన అనసూయ సేన్‌గుప్తా ముంబైలో ప్రొడక్షన్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించి తర్వాత నటిగా మారారు. తన ఫేస్‌బుక్ ఫ్రెండ్ అయిన బొజనోవ్ ఆమెకు ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఇక, నటిగా ఆమె తొలి ప్రయత్నంలోనే కేన్స్‌లో అవార్డు దక్కించుకున్నారు అంతేకాదు మొదటి భారతీయ మహిళగా నిలిచారు.

ఇదిలా ఉండగా.. 'ది షేమ్ లెస్ ' మూవీలో రేణుక అనే వేశ్య ఢిల్లీలో ఓ వ్యభిచార గృహంలో పోలీసును చంపి పారిపోతుంది. అక్కడ నుంచి ఆమె సె* వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం పొందుతుంది. అక్కడ 17 ఏళ్ల దేవికతో ప్రేమలో పడుతుంది. తర్వాత వీరిద్దరూ తమ ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగానే ఈ చిత్రం తెరకెక్కింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X