నాని సినిమా కోసం కదిలిన భారత క్రికెటర్లు... హీరో గారు కోరడం వల్లే ఇలా ప్లాన్.!
భారతదేశంలో సినిమాలకు, క్రికెట్‌కు మాత్రమే ప్రజల నుంచి భారీ స్థాయిలో స్పందన ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడ మ్యాచ్ జరిగినా స్టేడియాలు నిండిపోతాయి... సినిమా రిలీజ్ అయితే థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తాయి. ఇక, సినిమానే క్రికెట్ నేపథ్యంతో రూపొందింతే... దానికి ఎలాంటి స్పందన ఉంటుందో చాలా సందర్భాల్లో నిరూపణ అయింది. అలాంటి సినిమానే చేసి సక్సెస్ అయ్యాడు నేచురల్ స్టార్ నాని. ఇప్పుడా సినిమా కోసమే భారత క్రికెటర్లు అంతా కదిలి వస్తున్నారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

నాని నమ్మకాన్ని నిలబెట్టిన సినిమా
వరుస పరాజయాలతో సతమతమవుతున్న సమయంలో నానిని హిట్ ట్రాక్ ఎక్కించిన చిత్రం ‘జెర్సీ'. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించి నేచురల్ స్టార్ కెరీర్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. అలాగే, యాక్టింగ్ పరంగా నానిని మరో మెట్టుపై నిలబెట్టిందీ సినిమా.

‘జెర్సీ’తో దిల్ రాజు అదిరిపోయే ప్లాన్
తెలుగు సినిమాలకు హిందీలో మంచి మార్కెట్ ఉందన్న విషయం తెలిసిందే. దానికి తోడు క్రికెట్ నేపథ్యం ఉన్న మూవీ కావడంతో ‘జెర్సీ'ని బాలీవుడ్‌లోకి తీసుకెళ్లాలని టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్లాన్ చేశారు. ఆయనకు అల్లు అరవింద్ జత కలిశారు. వీళ్లిద్దరూ కలిసి రీమేక్ హక్కులు తీసుకుని, బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి దీన్ని తెరకెక్కిస్తున్నారు.

నిన్న విజయ్ దేవరకొండ.. నేడు నాని
విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ‘అర్జున్ రెడ్డి' ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను ‘కబీర్ సింగ్' పేరిట హిందీలోనూ రూపొందించారు. అక్కడ కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. అందులో హీరోగా నటించిన షాహీద్ కపూర్.. ‘జెర్సీ' రీమేక్‌లోనూ నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అందరిలోనూ అంచనాలు నెలకొన్నాయి.

జెర్సీ కోసం ఏ హీరో చేయనంతగా కష్టం
‘జెర్సీ' రీమేక్ కోసం బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్ ఎంతగానో కష్ట పడుతున్నాడు. అతడు దాదాపు ఆరు నెలలుగా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇప్పటికే రంజీ లెవెల్ కోచ్‌ల ఆధ్వర్యంలో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత నేషనల్ లెవెల్ కోచ్‌ల సహకారం కూడా తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే రోహిత్ శర్మ కోచ్ దినేష్ లాడ్ దగ్గర కూడా శిక్షణ తీసుకున్నాడు.
Recommended Video

రోహిత్ శర్మ సహా క్రికెటర్ల సహాయం
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు భారత క్రికెటర్లు సహాయం చేస్తున్నారు. ఇప్పటికే టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ.. హీరో షాహీద్ కపూర్‌కు బ్యాటింగ్‌కు సంబంధించిన కొన్ని సూచనలు చేశాడని ప్రచారం జరుగుతోంది. షాహీద్ కోరిక మేరకు ఇప్పుడు ఇంకొంత మంది క్రికెటర్లు కూడా అతడికి సహాయం చేయబోతున్నారని బీ టౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











