సినీ ప్రపంచంలో మరో విషాదం.. ప్రముఖ నటుడు సలీం కన్నుమూత!
సినీ ప్రపంచంలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మరో ప్రముఖ టెలివిజన్, సినీ నటుడు సలీం ఘౌస్ కన్నుమూశారు. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ఈ నటుడు మరోవైపు టెలివిజన్ రంగంలో కూడా మంచి నటుడిగా కొనసాగుతూ వచ్చారు. చిన్న వయసు నుంచే నటనపై ఎంతో ఆసక్తిని పెంచుకున్న సలీం మొదట సైడ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ ఆ తర్వాత లీడ్ రోల్స్ చేసేవరకు వచ్చాడు. అతని నటనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా ముందే సినీ ప్రముఖులు కూడా ఫ్యాన్స్ గా ఉన్నారు. నటన రంగంలో ఒక మంచి మనిషిగా కూడా సలీం గౌస్ గుర్తింపు పొందారు. ఇక గత కొంత కాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధ పడుతున్నారు.
సలీం గౌస్ ముంబైలో రీసెంట్ గా కన్నుమూశారు. దీంతో ఒక్కసారిగా సినీ ప్రపంచంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 70 ఏళ్ల ఈ నటుడు సినీ రంగంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. ఇక ఆయన మృతి చెందారు అని తెలియగానే చాలా మంది అభిమానులు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అమెజాన్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ నటుడు షరీబ్ హష్మీ ట్విటర్‌లో సలీం మృతికి సంతాపం తెలిపారు.

సలీం నటించిన కొన్ని టెలివిజన్ సీరియల్స్ చూడడం జరిగింది అంటూ అతని నటన పనితీరు అద్భుతంగా అనిపించింది అని ఇలాంటి నటుడిని ఇంతకుముందు చూడలేదు అని కూడా షరీఫ్ సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇక సలీం గౌస్ చనిపోయారు అని తెలియగానే ట్విట్టర్ వేదికగా చాలామంది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.
1952 జనవరి 10వ తేదీన చెన్నైలో జన్మించిన సలీం గౌస్ చిన్నతనం నుంచే నటన వైపు అడుగులు వేసే ప్రయత్నం చేశాడు. నాటక రంగంలో కూడా అతను గుర్తింపు అందుకున్నాడు. ఇక మెల్లగా 1978లో అతనికి మొదటి సినిమా అవకాశం దక్కింది. స్వర్గ్ నరక్ చిత్రంతో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించాడు, ఆ తర్వాత అతను చక్ర (1981), సారాంశ్ (1984), మోహన్ జోషి హజీర్ హో! (1984) సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్నాడు. ముఖ్యంగా సుబా అనే టీవీ సిరీస్‌తో ఎక్కువగా ఆదరణ పొందాడు. అతను ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్‌తో కూడా పనిచేశాడు. భరత్ ఏక్ ఖోజ్ సిరీస్‌లో రాముడు, కృష్ణుడు, టిప్పు సుల్తాన్ పాత్రలను పోషించాడు.
విలన్ పాత్రలకు ప్రసిద్ధి చెందిన సలీం కమల్ హాసన్ వెట్రి విజయ సిమిమలో కనిపించాడు. ఇక విజయ్ వెట్టైకారన్ సినిమాలో కూడా విలన్ గా నటించాడు. ఇక 1990లో వచ్చిన క్లాసిక్ మలయాళ చిత్రం తాజ్వారంలో సలీం మోహన్‌లాల్ తో కలిసి నటించాడు. సలీం కొన్ని ఇంటర్నేషనల్ ప్రాజెక్టులలో కూడా నటించడం జరిగింది. కిమ్, ది పర్ఫెక్ట్ మర్డర్, ది డిసీవర్స్, ద మహారాజాస్ డాటర్.. ఇలా విభిన్నమైన అంతర్జాతీయ ప్రాజెక్ట్ లలో నటించి ఎనలేని కీర్తిని సంపాదించారు.


Click it and Unblock the Notifications











