నా కూతురిని అరెస్ట్ చేస్తారని తెలుసు.. కుటుంబాన్ని నాశనం చేశారంటూ రియా తండ్రి ఆవేదన

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు ఇప్పుడు డ్రగ్స్ మాఫియా, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో చుట్టూ తిరుగుతోంది. ఈకేసులో భాగంగా ఇప్పటికే రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి, దీపేష్ సావంత్, సుశాంత్ ఇంటి మేనేజర్ శ్యామూల్ మిరాండా అరెస్ట్‌ను చేశారు. వీరిని విచారించిన తరువాత సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. వీరి స్టేట్మెంట్స్ ఆధారంగా నేడు రియా చక్రవర్తిని కూడా విచారిస్తున్నారు. ఈ క్రమంల రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి ఆవేదనకు లోనయ్యారు.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
సోదరి ఆదేశాలతోనే..

సోదరి ఆదేశాలతోనే..

తన సోదరి రియా చక్రవర్తి ఆదేశాల మేరకే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు డ్రగ్స్ ఇచ్చానని షోవిక్ చక్రవర్తి విచారణలో అంగీకరించినట్టు ఎన్‌సీబీ అధికారులు వెల్లడించారు. ఇక ఈ విషయంపై రియా చక్రవర్తిని కూడా విచారించేందుకు నిన్న సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఇద్దరిని కలిపి..

ఇద్దరిని కలిపి..

విచారణకు సహకరించాలని, వెంటనే వచ్చి మా ముందు హాజరు కావాలని ఎన్‌సీబీ అధికారులు శనివారం రాత్రి సమన్లు జారీ చేశారు. రియాను ప్రశ్నించేందుకు ఐదుగురు సభ్యుల బృందం సిద్ధమైనట్టు సమాచారం. అంతేకాకుండా శ్యామూల్ మిరాండా, షోవిక్ చక్రవర్తితో కలిపి రియాను ప్రశ్నించనున్నట్టు తెలిసింది. ఈ మేరకు డీఆర్డీవో గెస్ట్‌హౌస్‌ హైటెన్షన్ వాతావారణం నెలకొంది.

తండ్రి ఆవేదన..

తండ్రి ఆవేదన..

తన కుమారుడి అరెస్ట్, కూతురిపై వస్తోన్న ఆరోపణలను చూసిన రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి ఆవేదన చెందారు. కంగ్రాట్స్‌ ఇండియా, నువ్వు నా కొడుకును అరెస్టు చేశావు, ఆ తర్వాత వరుసలో నా కుమార్తె కూడా ఉందని నాకు తెలుసు. ఆ తదుపరి ఇంకెవరో తెలియదు.మొత్తానికి ఓ మధ్య తరగతి కుటుంబాన్ని సమర్థవంతంగా నాశనం చేశారు. అయితే న్యాయం జరగాలంటే వీటన్నింటినీ మనం సమర్థించాల్సి ఉంటుంది. జై హింద్‌ అంటూ సెటైరికల్‌గా స్పందించారు.

హాజరైన రియా..

హాజరైన రియా..

కాసేపటి క్రితమే రియా చక్రవర్తి.. ఎన్‌సీబీ అధికారుల ముందు హాజరైంది. ఆమె ఎలాంటి సమాధానాలు చెబుతుందో, ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో వేచి చూడాలి. ఇదిలా ఉండగా, శనివారం అరెస్ట్ చేసిన సుశాంత్ సిబ్బంది దీపేష్ సావంత్‌ను సెప్టెంబర్ 9వ తేదీ వరకు కస్టడీలో ఉంచుకునేందకు కోర్టు అనుమతిచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X