హీరోకు తీవ్ర గాయాలు.. షాక్‌లో చిత్రయూనిట్
తెలుగులో గతేడాది వచ్చిన చిత్రాల్లో జెర్సీ.. అందరి మన్నలను అందుకుంది. సగటు సినీ ప్రేక్షకుడు జెర్సీని చూసి భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ చిత్రంలో నాని అసాధారణ నటనకు క్రిటిక్స్ సైతం జై కొట్టారు. అంతలా అందర్నీ మెప్పించిన జెర్సీ హిందీలోనూ రీమేక్ కాబోతోన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ చిత్రం కోసం నాని ప్రత్యేకంగా క్రికెట్‌లో శిక్షణ తీసుకున్నాడు. దాదాపు 70 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నాకే షూటింగ్ మొదలు పెట్టినట్టు అప్పట్లో చెప్పుకొచ్చారు. అలాగే ఈ మూవీ హిందీ రీమేక్‌లో షాహిద్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షాహిద్ కూడా క్రికెట్ ఆటలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక షూటింగ్‌ను మొదలుపెట్టిన చిత్రయూనిట్‌కు ఎదురు దెబ్బ తగిలింది.

మొహలీ స్టేడియంలో షూటింగ్ జరుగుతూ ఉండగా.. క్రికెట్ బాల్ వేగంగా వచ్చి హీరో పెదవులకు తగిలిందని సమాచారం. ఈ ఘటనతో షాహిద్ కపూర్ పెదవులకు స్వల్పగాయం అయినట్టుగా తెలుస్తోంది. రక్తస్రావం కావడంతో షాహిద్ ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లిందట యూనిట్. చికిత్సలో భాగంగా షాహిద్ కపూర్ పెదవులకు మొత్తం 13 కుట్లు పడ్డాయట. దీంతో షూటింగ్‌కు విరామం ఇచ్చినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











