twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూన్ 12న అమెజాన్‌లో గులాబో సితాబో.. ఓటీటీ రిలీజ్‌పై ఐనాక్స్ తీవ్ర అసంతృప్తి

    |

    బాలీవుడ్ చిత్రం గులాబో సితాబో చిత్రాన్ని నిర్మాతలు ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకోవడంపై ఐనాక్స్ మల్టిప్లెక్స్ సంస్థ తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేసింది. లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకోవడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. దర్శకుడు షుజిత్ సర్కార్ డైరెక్షన్‌లో అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన ఈ చిత్రాన్ని జూన్ 12న అమెజాన్ ప్రైమ్‌ వీడియో‌ ఫ్లాట్‌ఫాంపై రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే.

    గులాబో సితాబో మూవీ రిలీజ్ వ్యవహారంపై సినిమా యూనిట్‌ పేరుగానీ, చిత్రం పేరును గానీ పేర్కొనకుండా ఐనాక్స్ తన ట్విట్టర్‌లో స్పందించింది. థియేటర్లలో రిలీజ్ చేయకుండా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫాం డైరెక్ట్‌గా రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం దారుణం. ఓ ప్రొడక్షన్ హౌస్ తీసుకొన్న నిర్ణయం అసంతృప్తిని, అసహనాన్ని కలిగించింది అని ఐనాక్ ట్విట్టర్‌లో పేర్కొన్నది.

    INOX disappointment over Gulabo Sitabo producers decision to release on OTT

    ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను చూపిస్తూ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సినీ సంప్రదాయలకు పక్కదారి పట్టించినట్టు అవుతుందని, ఈ నిర్ణయం ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నది. ఒకరి ప్రయోజనాలు, ఆర్ధిక వనరులు దెబ్బ తినకుండా సినిమా థియేటర్ల ఓనర్లు, నిర్మాత, దర్వకుడు సానుకూలమైన చర్చలు జరుపాల్సిన అవసరం ఉందని ఐనాక్స్ అభిప్రాయపడింది.

    ఇలాంటి కష్ట సమయాల్లో మా భాగస్వామ్యులు పరస్పర అవగాహన సంబంధాలపై ఆసక్తి చూపకపోవడం చాలా ఆందోళనకరంగా మారింది. ఒకరికొకరు అండగా నిలువాల్సిన సమయంలో ఇలాంటి నిర్ణయం నిరుత్సాహపరిచింది అని ఐనాక్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఎన్నో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని కాదని, థియేటర్లలో రిలీజ్ చేయకుండా ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయాన్ని దర్శక, నిర్మాతలు పున: సమీక్షించుకోవాలని ఐనాక్స్ సూచించింది.

    English summary
    INOX disappointment over Gulabo Sitabo producers decision to release on OTT. Amitabh Bachchan and Ayushmann Khurrana, the Shoojit Sircar-directed movie will debut on Amazon Prime Video on June 12 skipping Theatre release due to Coronavirus effect.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X