బాలీవుడ్‌లో సందీప్ రెడ్డి వంగా సరికొత్త ప్రయోగం.. టైటిల్, హీరో వివరాలివే!

Recommended Video

Here's The Title Of Sandeep Reddy Vanga Next Film || మహేష్ బాబుతో అనుకున్న కథనే

టాలీవుడ్‌లో 'అర్జున్ రెడ్డి' సినిమాతో సంచలనాలకు తెరలేపారు సందీప్ రెడ్డి వంగా. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా లాభాల పంట పండించింది. దీంతో అదే జోష్‌లో 'అర్జున్ రెడ్డి' సినిమాను 'కబీర్ సింగ్' పేరుతో హిందీలో రీమేక్ చేశారు సందీప్ రెడ్డి వంగా. ఇది కూడా సూపర్ సక్సెస్ సాధించడంతో సందీప్ రెడ్డి వంగా పేరు బాలీవుడ్‌లో మారుమోగింది. దీంతో బాలీవుడ్‌లో మరో సినిమా కోసం రంగం సిద్ధం చేశారట సందీప్ రెడ్డి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వివరాలు వైరల్ అవుతున్నాయి.

సందీప్ సరికొత్త ప్రయోగం

సందీప్ సరికొత్త ప్రయోగం

‘కబీర్ సింగ్'తో దర్శకుడిగా సత్తా చాటిన సందీప్ రెడ్డి వంగా.. బాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. మరి కొద్ది రోజుల్లోనే సెట్స్ పైకి వెళ్లనున్న తన రెండో సినిమాకు తానే నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. ఇంకా ఈ సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్ నిర్ణయించారని సమాచారం.

ఇదే టైటిల్ ఫిక్స్ చేశారా?

ఇదే టైటిల్ ఫిక్స్ చేశారా?

ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సందీప్ ఓ క్రైం థ్రిల్లర్ నేపథ్యంలో కథను రూపొందించారని, ఆ కథకు 'డెవిల్' అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలిసింది. ఆసక్తికర కథనం ఉండేలా ఆయన తన స్క్రిప్ట్‌కి తుది మెరుగులు దిద్దుతున్నారట. బాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయ్యేలా ఈ చిత్రంలో థ్రిల్లింగ్ సన్నివేశాలు ఉండనున్నాయట.

 బాలీవుడ్ స్టార్ హీరోతో కమిట్‌మెంట్

బాలీవుడ్ స్టార్ హీరోతో కమిట్‌మెంట్

ఇక ఈ చిత్రంలో హీరోగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించనున్నాడని సమాచారం. ఈ మేరకు ఆయనతో సందీప్ రెడ్డి సంప్రదింపులు జరపగా ఆయన ఓకే అనేశారనేది తాజా సమాచారం. చిత్రానికి సంభందించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటించనున్నారని తెలిసింది.

 మహేష్ బాబుతో అనుకున్న కథనే..

మహేష్ బాబుతో అనుకున్న కథనే..

నిజానికి మహేష్ బాబుతో ఏ సినిమా చేయబోతున్నానని చెప్పిన సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు అదే కథను హిందీలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడని అంటున్నారు. గతంలో మహేష్‌కు చెప్పిన కథను ఇప్పుడు రణ్‌బీర్ కపూర్‌తో తెరకెక్కించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

మంచి ఓపెనింగ్ వచ్చింది.. పక్కా!

మంచి ఓపెనింగ్ వచ్చింది.. పక్కా!

బాలీవుడ్‌లో 'కబీర్ సింగ్' రూపంలో మొదటి సినిమాతో సక్సెస్ సాధించాడు సందీప్ రెడ్డి వంగా. కొన్ని వివాదాలు చుట్టుముట్టినప్పటికీ సినిమా మాత్రం సూపర్ దుపె హిట్ సాధించి సందీప్ టాలెంట్ బయటపెట్టింది. సో మొదటి సినిమానే మంచి ఓపెనింగ్ ఇచ్చింది కాబట్టి ఇక ఆయన రెండో సినిమా కూడా సూపర్ హిట్ కావడం పక్కా! అంటున్నారు విశ్లేషకులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X