సమంతతో నా 'శృంగార' సన్నివేశాలు.. అందుకే తొలగించారు..సీక్రెట్స్ బయటపెట్టిన ఫ్యామిలీ మ్యాన్ నటుడు!
అక్కినేని కోడలు సమంత ఫ్యామిలీ మ్యాన్ సీజన్-2తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ఈ సిరీస్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొని తమిళ ఈలం సంస్థ కోసం పనిచేసే రాజీ అనే పాత్రలో కనిపించి ఆమె అలరించింది. రాజీ పాత్రలో ఆమె నటన దాదాపు అందరికీ నచ్చేసింది. దీంతో ప్రేక్షకుల నుంచే కాక సహ నటులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ సిరీస్ లో ఆమె తనతో కొన్ని శృంగార సన్నివేశాల్లో కూడా నటించిందని సహ నటుడు వెల్లడించాడు. ఆ వివరాల్లోకి వెళితే

బిజినెస్ మీద ఫోకస్
సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టని సమంత ఎక్కువగా బిజినెస్ మీద ఫోకస్ పెడుతోంది. అలాగే ఈ భామ తనకు వచ్చిన మొట్టమొదటి డిజిటల్ అవకాశాన్ని కూడా వదులుకోలేదు. ముందు ఈ పాత్ర తాను చేయగలనా లేదా అని ఆలోచించిన ఆమె ధైర్యం చేసి నటించింది. అయితే కధ పరంగా బోల్డ్, శృంగార సన్నివేశాల్లో కనిపించాల్సి వస్తుందని ముందే తెలిసినా సరే అన్నిటికీ సిద్ధమయ్యే వెళ్ళింది.

మా ఇద్దరి మధ్య అలా
తాజాగా ద ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత పాత్రతో చేసిన శృంగార సన్నివేశాల గురించి ఆమె సహనటుడు షాహబ్ అలీ తాజాగా కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఈ సిరీస్ లో సమంత రాజి పాత్ర సాజిద్ పాత్రతో కథలో భాగంగా ఇంటిమేట్ సీన్స్ చేసిందట. వారిద్దరూ ప్రేమలో పడ్డారని తెలిపేలా మేకర్స్ కొన్ని శృంగార సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే, వాటిలో చాలా వరకు ఫైనల్ ఎడిటింగ్ లో తొలగించారని షాహబ్ అలీ వివరించారు.

అలా లేపేశారు
సినిమాల్లో, సిరీస్ ల విషయంలో ఇది పెద్ద విషయం కాదని ఎప్పుడూ ఎడిటింగ్ లో సీన్స్ లేపేయడం జరుగుతూ ఉంటుందని వెల్లడించారు. తప్పనిసరి అనుకుంటే తప్ప కొన్ని సీన్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకువస్తారని అన్నారు. కొంచెం లాజిక్ లేదని అనిపించిన సీన్స్ ను తప్పిస్తారని చెప్పుకొచ్చారు. అలా సమంత, షాహబ్ అలీ మధ్య జరిగిన సాగిన బెడ్ రూమ్ సీన్స్ ను లేపేశారన్న మాట.

అది కూడా ఒక కారణం
నిజానికి సమంత హాట్ గా కనిపించిన రెండు మూడు సీన్స్ చూసే ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇక అలా కాకుండా చేసిన అన్ని శృంగార సన్నివేశాలు గనుక రిలీజ్ చేసి ఉంటే మామూలు రచ్చ ఉండేది కాదు. తమిళుల నుండి ఎదురైన విమర్శల వలన కూడా వెనక్కు తగ్గి ఉండవచ్చని అంటున్నారు.

సినిమాల విషయానికి వస్తే
సమంత ప్రస్తుతం నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరో పక్క గుణశేఖర్ తెరకెక్కిస్తున్న తెలుగు పురాణాలకు సంబంధించిన శాకుంతలం అనే సినిమాలో కూడా ఆమె లీడ్ రోల్ లో నటిస్తోంది. ఓ బేబీ దర్శకురాలు నందిని రెడ్డితో ఆమె ఒక హారర్ ఫిలిం కూడా చేస్తోందని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











