For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లై‌‌‌వ్‌లో బాయ్ ఫ్రెం‌డ్‌తో స్టార్ హీరో కూతురు రొమాన్స్.. ఛాలెంజ్ అంటూ!

  |

  బాలీవుడ్‌లో మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా పేరొందిన అమీర్ ఖాన్‌ కూతురు మరోసారి వార్తల్లోకొచ్చింది. అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తాకు కలిగిన ఇద్దరు సంతానంలో చిన్న పిల్ల అయిన ఇరా ఖాన్ గతంలో బాలీవుడ్‌కే చెందిన యంగ్ కంపోజర్ మిశాల్‌తో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత మిషాల్ కు, ఇరాకు అభిప్రాయ బేధాలు రావడంతో వాళ్లిద్దరూ విడిపోయారు.

  అయితే ఇరా ప్రస్తుతం అమీర్ ఖాన్ ఫిట్ నెస్ ట్రైనర్ నుపూర్ షీఖరేతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా నుపూర్ అమీర్ ఖాన్ కు ఫిట్ నెస్ ట్రైనర్ గా ఉన్నారు. ఈరోజు పుట్టిన రోజు సందర్భంగా లైవ్ సెషన్ నిర్వహించి, ఆ లైవ్ లో ఫిట్ నెస్ దుకాణం పెట్టేశారు. ఆ వివరాల్లోకి వెళితే

  తండ్రి బాటలో కాకుండా

  తండ్రి బాటలో కాకుండా

  తండ్రికి సినిమా వారసత్వం ఉన్నా కూడా ఆమె సినిమాల వైపు మాత్రం రావడం లేదు. ఇప్పటికే నెపోటిజమ్ అంటూ రచ్చ జరుగుతున్న సయమంలో ఇరా తీసుకున్న నిర్ణయం అందరికీ షాకిచ్చింది. ఎందుకంటే ఆమె సినిమా కాకుండా మరో కెరీర్ ఎంచుకుంది. వినూత్నంగా టాటూ బిజినెస్‌లోకి అడుగు పెట్టింది. పచ్చబొట్టు ఎలా వేయాలి ? దాన్ని ఎలా బిజినెస్ చేయాలి లాంటి అంశాలను నేర్చుకొని ఆ బిజినెస్ లోకి దిగింది.

  లాక్ డౌన్ లో కొత్త లవ్

  లాక్ డౌన్ లో కొత్త లవ్

  ఇక గత కొన్నేళ్లుగా అమీర్ కు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్న నుపూర్ లాక్‌డౌన్‌ లో ఇరాకు వర్కౌట్ల విషయంలో కోచ్‌గా మారారు. అయితే, నుపూర్‌ వ్యక్తిత్వం నచ్చడం వల్ల ఐరా అతనితో ప్రేమలో పడిందట. కొన్నినెలలుగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రోజు ఆమె పుట్టిన రోజు నేపథ్యంలో ఆమె కోసం ఆమె చిన్ననాటి పిక్ అలాగే ఇటీవల ఒక కుక్కతో దిగిన పిక్ షేర్ చేసి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

   బర్త్ డే బేబీకి విషెస్

  బర్త్ డే బేబీకి విషెస్

  హాయ్ ఇరా ఖాన్, నా ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు, నేను చాలా చెప్పాలని అనుకుంటున్నా, కానీ సింపుల్ గా చెప్పేస్తున్నా, ఐ లవ్ యూ'' అని కామెంట్ చేశారు. ఇక అలాగే బర్త్ డే గర్ల్ తో ఆయన సమయం గడిపారు. ఇక దానికి ఇరా ఖాన్ కూడా ఆసక్తికరంగా స్పందించింది. ''నీకు కాల్ చేస్తున్నా, నీ నోటి నుండి వినాలనుకుంటున్నాను'' అని పేర్కొంది. థాంక్యూ, లవ్ యూ అని పేర్కొంది.

  Naga Shaurya Second Banner, Ira Cinemas
  మానసిక ఒత్తిడి నుంచి బయటపడి

  మానసిక ఒత్తిడి నుంచి బయటపడి

  ఇక ఇరా తనపై జరిగిన లైంగిక దాడి గురించి కూడా బహిర్గతం చేసి సంచలనం రేపింది. అది విన్న తర్వాత అంతా షాక్ అయ్యే పరిస్థితి. తన తల్లిదండ్రులు ఎందుకు విడాకులు తీసుకున్నారు, తాను ఎందుకు ఒంటరిగా గదిలో ఉండాల్సి వచ్చింది లాంటి అంశాలను పంచుకుంది. ఆ సమయంలో తాను మానసిక ఒత్తిడికి గురయ్యానని చెప్పుకొచ్చారు.

  లైవ్ లో అసలు పని

  ఇక ఈ రోజు పుట్టిన రోజు నేపథ్యంలో ఈ జంట తమ అభిమానుల కోసం లైవ్ సెషన్ నిర్వహించారు. అయితే ఆ లైవ్ సెషన్ లో ఏదయినా ముచ్చట్లు పెడతారు అంటే, అలా కాకుండా ఇద్దరూ కలిసి వర్కౌట్స్ చేసి షాకిచ్చారు. అంతే కాదు ఇన్‌స్టాగ్రామ్‌లో మరో వీడియో షేర్ చేసిన ఇరా, "నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. 4 వారాలు, వారానికి 7 రోజులు, రోజుకు 25 నిమిషాలు. నేను చేయగలనా? నేను మానసికంగా ఎంత ఇబ్బంది పడుతున్నా, నేను నా కోసం దీన్ని చేయగలగాలి ? # ఛాలెంజ్. అని రాసుకొచ్చింది.

  English summary
  Aamir Khan’s daughter Ira Khan is celebrating her 23rd birthday today. she posted a video informing her followers about a fitness challenge that she is taking up to let go of a certain “heavy” feeling. And then she with her BF Nupur conducted live workouts session.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X