మరోసారి తెలుగులో నటించాలని అనుకున్న ఇర్ఫాన్ ఖాన్.. గోపిచంద్ సినిమాలో జస్ట్ మిస్?
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త సినీ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కన్నుమూశారు. దీంతో బాలీవుడ్ ప్రముఖ నటులు ఈ షాక్ నుండి కొలుకోలేకపోతున్నారు. లాక్ డౌన్ సమయంలో ఆయనను కడసారి చూసే పరిస్థితి కూడా లేదు. బాలీవుడ్, హాలీవుడ్ అనే కాకుండా తెలుగుతెరపై కూడా ఇర్ఫాన్ ఖాన్ కనిపించారు.
Recommended Video

సైనికుడు సినిమాలో విలన్..
2006లో మహేష్ బాబు కథానాయకుడిగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సైనికుడు సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. అప్పటికే బిజీగా ఉన్న ఇర్ఫాన్ ఖాన్ ఆ సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఇబ్బంది పడ్డారు. భారీ అంచనాలతో విడుదలైన ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా ఇర్ఫాన్ ఖాన్ నటనకు తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.

మరో సినిమా చేయాలని..
హాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఇర్ఫాన్ ఖాన్ తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న సమయంలో టాలీవుడ్ సినిమాలలో కూడా నటించాలని గత కొన్నేళ్లుగా అనుకున్నారట. మధ్య మధ్యలో కొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ నచ్చక వదిలేశారట. ఇక మరికొన్నిటిని డేట్స్ అడ్జస్ట్ చేయలేక వధులుకోవాల్సి వచ్చిందట.

అదే చివరి సినిమా..
ఆ మధ్య కాలంలో దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి సాహసం సినిమా విలన్ పాత్రకు ఇర్ఫాన్ ఖాన్ అయితే బావుంటుందని ఆయనని సంప్రదించారట. గోపిచంద్ హీరోగా నటించిన ఆ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ కూడా నటించాలని అనుకున్నారు కానీ ఎందుకో కుదరలేదట. టాలీవుడ్ లో చివరగా 2006లో మాత్రమే కనిపించిన ఇర్ఫాన్ తెలుగు సినిమాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సమయంలో మరణించడం తెలుగు జనాలను కూడా కలచివేస్తోంది.

తల్లి మరణించిన కొన్ని రోజులకే..
ఈ నెల 25న ఇర్ఫాన్ ఖాన్ తల్లి సైదా బేగం మృతి చెందింది. అయితే లాక్ డౌన్ కారణంగా ఇర్ఫాన్ కడసారి కూడా తన తల్లిని చూసుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు క్యాన్సర్ భారిన పడి శాశ్వతంగా తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడాని ఇర్ఫాన్ కుటుంబం సభ్యులు శోక సంద్రంలో మునిగారు. హాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు కూడా ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











