ఆమె కోసమైనా బతకాలనిపించింది.. ఆ సమయంలో ప్రతీక్షణం నా పక్కనే.. నటుడి ఉద్వేగం
ఒక్కప్పుడు క్యాన్సర్ వస్తే.. నో ఆప్షన్స్.. మరణించాల్సిందేనన్న అపోహ ఉండేది. అయితే క్యాన్సర్‌ను జయించి.. ఆ వ్యాధినే తిరిగి భయపెట్టిన వారెంతో మంది ఉన్నారు. వైద్య శాస్త్రంలోని పరిశోధనలతో క్యాన్సర్‌ను అరికట్టేశారు. అయితే క్యాన్సర్ బారిన పడ్డ సినీ సెలెబ్రిటీలు మనోధైర్యం కోల్పోకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి వచ్చారు.

క్యాన్సర్ బారిన పడ్డ ఇర్ఫాన్, సోనాలీ..
బాలీవుడ్ స్టార్స్ ఇర్ఫాన్ ఖాన్, సోనాలీ బింద్రే వంటి వారు క్యాన్సర్ బారిన పడ్డారు. అయితే ఇందులో సోనాలీ మాత్రం పూర్తిగా రికవరీ అయింది. ఇర్ఫాన్ మాత్రం ఇంకా చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు. చికిత్స నిమిత్తం లండన్ వెళ్లి వస్తున్నాడు.

అభిమానుల్లో ఆందోళన..
ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ బారిన పడ్డాడని వార్తలు రాగానే ఆయన అభిమానుల్లో ఒకటే ఆందోళన. అయితే స్వయంగా ఇర్పాన్ ఖాన్ ఆ వార్తలపై స్పందిస్తూ.. ఆందోళన చెందే విషయం ఏమీ లేదు.. ప్రస్తుతం బాగానే ఉన్నానని, ఎవ్వరూ కంగారు పడవద్దని తెలిపాడు.

అంగ్రేజీ మీడియం షూటింగ్‌లో బిజీ..
అప్పటికే అంగ్రేజీ మీడియం షూటింగ్‌లో బిజీగా ఉన్న ఇర్ఫాన్.. వైద్యం కోసం లండన్ వెళ్లాడు. అయితే వీలు చిక్కినప్పుడల్లా షూటింగ్‌లో పాల్గొనేవాడు. ఎట్టకేలకు ఈ మూవీ విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా ఇర్ఫాన్ మాట్లాడుతూ.. నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు.

ఆమె కోసమైనా బతకాలనిపించింది..
క్యాన్సర్ వచ్చినప్పుడు తన భార్య సుతాపా పడిన తపన, బాధ, చూపించిన ప్రేమ వాటికోసమైనా బతకాలనిపించిందని చెప్పుకొచ్చాడు. ఇరవై నాలుగు గంటలు తనతోనే ఉండేదని ఎంతో జాగ్రత్తగా చూసుకునేదని తెలిపాడు. ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం ఆమెనని ఎమోషనల్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











