»   » ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యం విషమం.. చివరిదశలో.. బతికేది మరికొన్ని రోజులేనట..

ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యం విషమం.. చివరిదశలో.. బతికేది మరికొన్ని రోజులేనట..

Posted By:
Subscribe to Filmibeat Telugu

విలక్షణ నటుడు, బాలీవుడ్ హీరో ఇర్ఫాన్ ఖాన్ అరుదైన వ్యాధికి గురై సినీ వర్గాలను విషాదంలోకి నెట్టిన సంగతి తెలిసిందే. న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అనే అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారిందనే వార్త అభిమానులను మరింత కుంగదీస్తున్నది.

ఇర్ఫాన్ కి ఇంత భయంకరమైన వ్యాదా?
అమెరికాలో ఇర్ఫాన్‌ ఖాన్‌కు చికిత్స

అమెరికాలో ఇర్ఫాన్‌ ఖాన్‌కు చికిత్స

అమెరికాలో ఇర్ఫాన్ ఖాన్‌‌కు చికిత్సనందిస్తున్నారు. కానీ ఆయన ఆరోగ్యంపై ఎలాంటి బులెటిన్లు వెల్లడించడం లేదు. కానీ ఇర్ఫాన్ ఖాన్ మరెన్నో రోజులు బతుకకపోవచ్చు అనే మాట వినిపిస్తున్నది. కానీ అధికారికంగా ఎక్కడ ప్రకటన వెలువడలేదు.

ఉమేర్ సంధూ షాకింగ్ ట్వీట్

ఉమేర్ సంధూ షాకింగ్ ట్వీట్

అయితే సినీ విమర్శకుడు ఉమేర్ సంధూ మాత్రం షాకింగ్ ట్వీట్ చేశారు. రోజు రోజుకు ఇర్ఫాన్ ఆరోగ్యం క్షీణిస్తున్నది. ఇర్ఫాన్ ఫైనల్ స్టేజ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఒక నెల కంటే ఎక్కువ బతుకలేరు అని ఉమేర్ తెలిపారు.

 క్యాన్సర్ చివరి దశలో

క్యాన్సర్ చివరి దశలో

బ్రేకింగ్ న్యూస్! ఇర్ఫాన్ ఖాన్ కుటుంబ సభ్యులు వెల్లడించిన ప్రకారం.. అతడికి సోకిన క్యాన్సర్ చివరి దశలో ఉంది. మరో 30 రోజుల కంటే ఎక్కువ బతికే అవకాశం లేదు అని డాక్టర్లు తేల్చేశారు అని ఉమేర్ ట్వీట్ చేశారు.

మే 15 తేదీ నాటికి మాత్రమే

మే 15 తేదీ నాటికి మాత్రమే

వైద్యులు, కుటుంబ సభ్యులు వెల్లడించినట్టు వస్తున్న వార్తల ప్రకారం ఇర్పాన్ మే 15వ తేదీకి మించి బతికే అవకాశం లేదు అని బాలీవుడ్ పత్రికలు కథనాలను వెల్లడిస్తున్నాయి. ఈ వార్తలతో సినీ వర్గాలు, ఫ్యాన్స్ మరింత కుంగిపోతున్నారు.

దీపికతో సినిమా క్లోజ్

దీపికతో సినిమా క్లోజ్

ఇలాంటి వార్తల నేపథ్యంలో ఇర్ఫాన్ ఖాన్‌తో రూపొందించబోయే సినిమాను విశాల్ భరద్వాజ్ పక్కన పెట్టేశారు. ఈ చిత్రంలో ఇర్ఫాన్ సరసన దీపికా నటించాల్సింది. ఇక ఈ సినిమాను విశాల్ భరద్వాజ్ తీయకపోవచ్చు అనే మాట కూడా వినిపిస్తున్నది.

 చైనాలో ఇర్ఫాన్‌కు ప్రభంజనం

చైనాలో ఇర్ఫాన్‌కు ప్రభంజనం

ఇదిలా ఉండగా, ఇర్ఫాన్ ఖాన్ నటించిన హిందీ మీడియం అనే చిత్రం చైనాలో దుమ్మురేపుతున్నది. దంగల్, భజరంగీ భాయ్‌జాన్ చిత్రాల రికార్డులను తిరగరాస్తున్నది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరడం గమనార్హం.

English summary
Film Critic Umair Sandhu tweeted about Bollywood actor Irrfan Khan health. As per reports his health is consistently deteriorating. Umair tweeted that Breaking news.. As per Family sources of Irrfan Khan. His cancer is at last stage and doctors are of the opinion that he may not last more than a month.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X