ఇర్ఫాన్ ఖాన్ కుటుంబంలో తీవ్ర విషాదం.. బాలీవుడ్ ప్రముఖుల ఓదార్పు
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇంట్లో విషాదం చోటుచేసుకొన్నది. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇర్ఫాన్ తల్లి సయీదా బేగం శనివారం కన్నుమూశారు. ఆమె వయసు 95 సంవత్సరాలు. అయితే కరోనా లాక్‌డౌన్ కారణంగా తన తల్లిని చివరి సారి చూసుకోలేకపోవడం మరో విషాదంగా మారింది. మాతృవియోగంతో బాధపడుతున్న ఇర్ఫాన్‌కు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..

జైపూర్‌లో ఇర్ఫాన్ తల్లి మృతి
ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయిదా రాజస్థాన్‌కు చెందిన టోంక్ నవాబ్ వంశానికి చెందిన వారు. జైపూర్‌లోని బెనీవాల్ కంటా కృష్ణ కాలనీలో నివాసం ఉంటున్నారు. గత కొద్దికాలంగా ఆమె వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. తాజాగా ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ ఆమె మరణించారు అని కుటుంబ సభ్యులు తెలిపారు.

విదేశాల్లో ఇర్ఫాన్ ఖాన్
తాజా సమాచారం ప్రకారం.. ఇర్ఫాన్ ఖాన్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. తన తల్లి మరణంతో విషాదంలో మునిగిపోయారు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఆయన విదేశాల నుంచి రావడానికి కష్టంగా మారింది. కావున ఆయన తల్లి అంత్యక్రియలకు హాజరుకాలేదు అని సన్నిహితులు తెలిపారు. సయిదా అంత్యక్రియలను శనివారం సాయంత్రం నిర్వహించారు.

బాలీవుడ్ ప్రముఖుల సంతాపం
విషాదంలో ఉన్న ఇర్ఫాన్ ఖాన్‌కు పలువురు ప్రముఖులు ఫోన్‌లోను, సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. పికూ డైరెక్టర్ షుజిత్ సర్కార్ స్పందిస్తూ.. ఇర్ఫాన్ తన మాతృమూర్తిని కోల్పోవడం చాలా విషాదకరం. ఆయనకు ఫోన్ చేసి సంతాపం తెలిపారు. ఇలాంటి సమయంలో ఇర్ఫాన్‌కు ఇలా జరగడం అత్యంత బాధకరం అని అన్నారు.
Recommended Video

క్యాన్సర్‌ను జయించి
ఇర్ఫాన్ ఖాన్ విషయానికి వస్తే.. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. క్యాన్సర్ వ్యాధిన పడటంతో ఆయన లండన్‌లో చికిత్స పొందారు. ప్రస్తుతం క్యాన్సర్‌ను జయించిన ఆయన సినిమాల్లో బిజీగా మారారు. ఆయన నటించిన ఆంగ్రేజీ మీడియం సినిమా రిలీజ్ అయింది. కానీ లాక్‌డౌన్ కారణంగా సినిమాను థియేటర్ల నుంచి ఎత్తేశారు. త్వరలోనే ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నది.


Click it and Unblock the Notifications











