twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ నిజాన్ని అంగీకరించడం కష్టంగా ఉంది..: గుండెను పిండేసిన ఇర్ఫాన్ ఖాన్

    |

    Recommended Video

    ఇర్ఫాన్ కి ఇంత భయంకరమైన వ్యాదా?

    ఇర్ఫాన్ ఖాన్.. విలక్షణ నటనకు కేరాఫ్. ఆయన సినిమా వస్తుందంటే.. రొటీన్ మాస్ మసాల వ్యవహారం కాకుండా.. సమ్‌థింగ్ కొత్తగా ట్రై చేసి ఉంటారన్న అంచనాలు ఉంటాయి. ఆయన ఎంచుకునే కథలు, నటనలో ఆయన కనబరిచే వైవిధ్యత.. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టాయి. ఇర్ఫాన్ నటనంటే పడి చచ్చే ఎంతోమందికి ఇప్పుడాయన ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్‌ ఖాన్ శుక్రవారం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు.

    'న్యూరోఎండోక్రైన్ క్యాన్సర్' :

    'న్యూరోఎండోక్రైన్ క్యాన్సర్' :

    చర్మం లోపలి కణజాలంతోపాటు అంతర్గత శరీర భాగాలకు కూడా విస్తరించే 'న్యూరోఎండోక్రైన్ క్యాన్సర్' అనే అరుదైన వ్యాధితో తాను బాధపడుతున్నట్టు వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం విదేశాలకు వెళ్లినట్టు చెప్పారు.

     ధైర్యాన్నిస్తున్నారు..:

    ధైర్యాన్నిస్తున్నారు..:

    శరీరంలోని ఏ భాగానికైనా పాకే ఈ వ్యాధిని నియంత్రించడం చాలా కష్టంతో కూడుకున్నదని.. ఈ కష్టకాలంలో దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యాన్ని, మద్దతును బంధువులు, స్నేహితులు, అభిమానుల నుంచి పొందుతున్నానని పేర్కొన్నారు.

     గుండెను పిండేసే మాట..:

    గుండెను పిండేసే మాట..:

    ప్రముఖ అమెరికన్ రచయిత మార్గరేట్ మిచెల్ గాన్ 'విత్ ది వైండ్' పుస్తకంలోని వాక్యాలను ఉటంకిస్తూ.. ఇర్ఫాన్ తన ప్రకటన విడుదల చేయడం గమనార్హం. 'మనం ఆశించినది మనకు ఇవ్వడానికి జీవితం ఎటువంటి బాధ్యత వహించదు' అన్న ఆ మాటలు గుండెను తాకేలా ఉన్నాయి.

     నిజాన్ని అంగీకరించడం కష్టంగా ఉంది

    నిజాన్ని అంగీకరించడం కష్టంగా ఉంది

    తనకు న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ ఉందని తెలిసినప్పటి నుంచి.. నిజాన్ని అంగీకరించడానికి మనసుకు చాలా కష్టంగా ఉన్నట్టు ఇర్ఫాన్ ఆవేదన వ్యక్తం చేశారు. అందరి నుంచి వస్తున్న మద్దతు అలాగే కొనసాగాలని, మీ నుంచి మరిన్ని విషెస్ కోరుకుంటున్నానని ఇర్ఫాన్ అభిమానులకు వెల్లడించారు.

    ఫైనల్ వర్డ్:

    ఫైనల్ వర్డ్:

    తన ఆరోగ్యం గురించి చాలానే ఊహాగానాలు బయలుదేరాయని, అలాంటివేవి ఊహించుకోకుండా ఉన్న వారికి కృతజ్ఞతలు అని ఇర్ఫాన్ అన్నారు. అలాగే న్యూరో అంటే కేవలం మెదడుకు సంబంధించినది మాత్రమే కాదని చెప్పారు. నా మాటల కోసం ఎదురుచూస్తున్నవారికి మరిన్ని విషయాలు చెప్పడానికి త్వరలోనే నేను తిరిగి వస్తున్నానని ఆశిస్తున్నా.. అంటూ ఇర్ఫాన్ ముగించారు.

    ఊహాగానాలకు చెక్..:

    ఇర్ఫాన్ ప్రకటనతో ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలకు తెరపడినట్టయింది. అదే సమయంలో ఆయన ఆరోగ్యం కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఆశిస్తున్నారు.

    English summary
    Irrfan Khan suffering from Neuroendocrine Tumour: Everything you need to know about the disease
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X