ఇర్ఫాన్ ఖాన్ భార్య భావోద్వేగమైన లేఖ.. గతేడాది ఓ జీవితంలా...
క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకొని నటుడు ఇర్ఫాన్ ఖాన్ మళ్లీ షూటింగ్‌లకు హాజరవుతున్న నేపథ్యంలో ఆయన భార్య ఎమోషనల్‌గా స్పందించారు. కొద్ది రోజుల క్రితం ఉదయ్ పూర్‌లో జరిగిన అంగ్రేజీ మీడియం సినిమా షూటింగ్‌కు ఇర్ఫాన్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన భార్య సుతాప సిక్దర్ భావోద్వేగమైన లేఖ రాశారు.
ఫిబ్రవరి 2018లో ఇర్ఫాన్ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ ఉందని వైద్యులు నిర్ధారించారు. దాంతో ఆయనను చికిత్స కోసం లండన్‌కు తీసుకెళ్లాం. గత ఏడాది ఓ జీవితంలా గడిచింది అని సిక్దర్ లేఖలో పేర్కొన్నారు.

గతేడాది నుంచి ఇప్పటి వరకు గడిచిన క్షణాలను సమయంతో పోల్చలేం. ఆ వ్యాధిని ధీటుగా ఎదురించి మళ్లీ షూటింగ్‌కు రావడం వరకు మా జీవితం చాలా భావోద్వేగంగా సాగింది. అందరి ప్రార్థనల వల్లే ఇది సాధ్యమైంది అని ఆమె అన్నారు.
కష్టకాలంలో మాకు లభించిన సహకారం, నైతిక మద్దతు అమోఘమైనది. ఎంతో మంది ఇర్ఫాన్ క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థించారు. వారికి పేరు పేరున నా ధన్యవాదాలు అని అన్నారు.
ఇర్ఫాన్ ఖాన్ నటిస్తున్న అంగ్రేజీ మీడియం సినిమా గతంలో వచ్చిన హిందీ మీడియం సినిమాకు సీక్వెల్. హిందీ మీడియంలో పాకిస్థానీ నటి సబా కామర్‌తో జోడి కట్టగా, అంగ్రేజీ మీడియంలో కరీనా కపూర్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు హోమీ అదాజనియా.


Click it and Unblock the Notifications











