ఆరు దశల్లో నటుడికి క్యాన్సర్ ట్రీట్మెంట్.. ఆరోగ్య పరిస్థితి ఇప్పటికి సందిగ్దమే!
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ బారిన పడడం మొతం ఇండియానే షాక్ కి గురిచేసింది. ప్రస్తుతం ఉన్న అద్భుత నటులలో ఇర్ఫాన్ ఖాన్ కూడా ఒకరు. ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ కు ప్రస్తుతం లండన్ లో చికిత్స పొందుతున్నారు. తాజగా ఓ ఇంటర్వ్యూ లలో తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించాడు.
తనకు క్యాన్సర్ నయం కావాలంటే అరుదశలో కీమోథెరపీ చికిత్స విజయవంతంగా పూర్తికావాలని అన్నాడు. అయినా కూడా తన లైఫ్ కు గ్యారెంటీ లేదని తెలిపాడు. ప్రస్తుతం నాల్గవ దశ చికిత్స జరుగుతోందని, ఇప్పటికైతే ఆరోగ్య పరిస్థితి కొంత ఆశాజనకంగానే ఉందని తెలిపాడు. కానీ పూర్తిగా నయం అవుతుందా లేదా అనే విషయం తేలాలంటే ఆరవ దశ చికిత్స పూర్తి కావాలని తెలిపాడు.

ఇర్ఫాన్ ఖాన్ తో పాటు అందాల నటి సోనాలి బింద్రే కూడా క్యాన్సర్ బారిన పడింది. ఆమె కూడా ప్రస్తుతం చికిత్స చేయించుకుంటోంది. యువరాజ్ సింగ్, మనీషా కొయిరాలా వంటి ప్రముఖులు క్యాన్సర్ ని జయించారు.


Click it and Unblock the Notifications











