Divorce: 17 ఏళ్ల వైవాహిక బంధానికి ఐశ్వర్య, అభిషేక్ గుడ్ బై?.. కూతురు ఎవరి వద్ద ఉంటుందంటే?
బాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశమైన వార్త ఏదైనా ఉందంటే.. అది అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ జంట విడాకుల విషయమే. గత కొద్ది నెలలుగా ఈ వార్త మీడియాలో హాట్ టాప్‌గా మారింది. ఇటీవల కొన్ని సంఘటనలు ఈ వార్తకు మరింత బలాన్ని ఇచ్చాయి. అయితే కొంత మేరకు వీరిద్దరి విడిపోవడం రూమర్లుగానే పరిగణించినప్పటికీ.. తాజాగా అది వాస్తవమేనని బాలీవుడ్ వర్గాలు తెల్చేస్తున్నాయి. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
అయితే ధూమ్ 2 షూటింగ్ సమయంలో అభిషేక్ బచ్చన్‌తో ఐశ్వర్య ప్రేమలో పడింది. వారిద్దరి మధ్య ప్రేమ విడదీయలేనంతగా మారడంతో జనవరి 14వ తేదీ 2007 సంవత్సరంలో వివాహం చేసుకొన్నారు. 2011 సంవత్సరంలో వారిద్దరు ఆరాధ్యకు జన్మనిచ్చారు. అయితే వారిద్దరి కాపురం అన్యోన్యంగా సాగుతుందని అనుకొన్నారు. కానీ అనేక రూమర్లు భారీగా రావడంతో అనేక అనుమానాలు తలెత్తాయి.

నిప్పు లేకుండా పొగ రాదు అనే సామెతకు బలాన్ని ఇస్తూ.. ఇటీవల ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం అభిషేక్, ఐశ్వర్య రాయ్ వేర్వేరుగా ఉంటున్నారనే విషయం స్పష్టమైంది. దేశంలోనే అత్యంత కన్నుల పండువగా జరిగిన ఈ పెళ్లిలో అభిషేక్‌తోపాటు అమితాబ్ కుటుంబం కలిసి రావడం, ఐశ్వర్య రాయ్ మాత్రం తన కూతురు ఆరాధ్యతో రావడం అత్యంత చర్చనీయాంశమైంది.
అయితే ఇటీవల అమితాబ్ అధికార నివాసం జల్సా నుంచి ఐశ్వర్యరాయ్ తన తల్లి ఇంటికి వెళ్లిపోవడం మీడియా కంటపడింది. అయితే కొంత కాలం నుంచి జల్సాలో కాకుండా ఆమె పక్కనే ఉన్న మరో ఇల్లు వత్సాలో ఉంటున్నారనే విషయం బయటకు పొక్కింది. అయితే వత్సా నుంచి కూడా ఆమె ఖాళీ చేసి ముంబైలోని తన తల్లి వద్ద ఉంటున్నారని భాలీవుడ్‌లో కథనాలు వెలువడ్డాయి.

తాజా సమాచారం ప్రకారం.. ఐశ్వర్య, అభిషేక్‌కు 17 ఏళ్ల దాంపత్యానికి తెరపడింది. వారిద్దరి అధికారికంగా విడాకులు తీసుకోబుతున్నారు. కొద్ది రోజుల్లోనే వారి నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుంది అనే ఓ వార్త బాలీవుడ్, జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే అధికారికంగా రెండు వర్గాల నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడం మరింత ఆసక్తిని పెంచింది.
అయితే ప్రస్తుతం మీడియాకు అందిన సమాచారం ప్రకారం.. అభిషేక్, ఐశ్వర్య విడాకుల వ్యవహారం ఖాయమైంది. వారిద్దరు విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే కుమార్తె ఆరాధ్య మాత్రం బచ్చన్ ఫ్యామిలీలో ఉండేలా నిర్ణయం జరిగింది అనే విషయం ప్రచారంలో ఉంది.


Click it and Unblock the Notifications











