twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరో కూతురు అఫైర్ బ్రేకప్.. విరహ వేదనతో చేసిన పోస్ట్ వైరల్

    |

    బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ ఇంకా సినీ రంగ ప్రవేశం చేయకుండానే మీడియాలో పతాక శీర్షికల్లోకి ఎక్కుతున్నది. గత కొద్దికాలంగా యువ సంగీత దర్శకుడితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా బాయ్‌ఫ్రెండ్‌తో సన్నిహితంగా ఉండే ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారి అఫైర్ అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో ఇరా ఖాన్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

     పరిస్థితులన్నీ సానుకూలంగానే

    పరిస్థితులన్నీ సానుకూలంగానే

    యువ సంగీత దర్శకుడు మిషాల్ కృపలానీతో ఇరా ఖాన్ అఫైర్, డేటింగ్ కొనసాగుతున్నట్టు బాలీవుడ్‌ మీడియాలో ఎక్కువగా కథనాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అన్ని విషయాలు ఒకే.. ఎలాంటి ఆందోళన లేదు. నీకు దూరంగా ఉండటం బాధగా ఉంది. ఇలాంటి సంఘటనలు జరగడం సాధారణమే అంటూ ఇరా సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

    ఇలాంటి సమయంలోనే

    ఇలాంటి సమయంలోనే

    జీవితంలో ఇలాంటి సమస్యలు, ఇబ్బందులు రావడం సహజమే. అలాంటి సమయంలోనే రిలేషన్‌ను గట్టిగా బలపరుచుకోవాలి. ప్రతికూల సమయంలోనే సంయమనం పాటించాలి. ముఖంపై చిరునవ్వు చిందించాలి అంటూ ఇరా తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. దీంతో కొంత మంది అభిమానులు ఆమెకు అండగా నిలువగా..మరికొంత మంది రకరకాల కామెంట్లు చేశారు.

    మిషాల్‌కు దూరంగా అంటే

    మిషాల్‌కు దూరంగా అంటే

    మిషాల్ కృపలానీకి దూరంగా ఉండటమంటే .. ఏదో పని మీద ఎక్కడికైనా వెళ్లి ఉండవచ్చు. ఆ విరహ వేదనతోనే పోస్టు పెట్టి ఉంటుందేమో అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. అలా అయితే త్వరలోనే బాయ్‌ఫ్రెండ్‌ను కలుసుకోవాలని ఆకాంక్షించారు.

    బ్రేకప్ అంటూ ఊహాగానాలు

    బ్రేకప్ అంటూ ఊహాగానాలు

    ఇక మరికొందరు మిషాల్‌తో ఇరా ఖాన్ బ్రేకప్ అయింది. దిల్ టూట్ గయా (హృదయం ముక్కలైంది) అంటూ కొందరు నెటిజన్లు, ఫాలోవర్స్ కామెంట్లతో హల్‌చల్ చేశారు. అయితే బ్రేకప్ జరిగిందా? లేక దూరంగా ఏదైన పనిమీద ఇతర ప్రాంతానికి వెళ్లాడా అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే కొద్ది సమయం ఓపిక పడితే అదే తెలుస్తుందంటున్నారు. కాకపోతే ఈ పోస్ట్ మాత్రం వైరల్‌గా మారింది.

    English summary
    Aamir Khan's daughter Ira Khan in affair with young musician Mishaal, In this occassion, Ira took to Instagram to share a picture of herself with boyfriend Mishaal and said that she is missing him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X