What is Grey Divorce? అభిషేక్, ఐశ్వర డైవోర్స్‌లో ట్విస్ట్.. కొత్త మార్గంలో విడాకులకు సిద్ధం!
ఇండియన్ సినిమా పరిశ్రమలో అత్యధికంగా వార్తల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకుల వార్తనే. అయితే వీరిద్దరి డైవోర్స్ విషయంలో రోజుకో విషయం వెలుగులోకి వస్తున్నది. అయితే వీరి మధ్య నెలకొన్న దాంపత్య వివాదంలో అసలు విషయం ఏమిటో క్లారిటీ లేకపోవడం గందరగోళంగా మారింది. అయితే తాజాగా వీరిద్దరి తీసుకోబోయే విడాకులకు మాత్రం కొత్త ట్యాగ్ తగిలించారు. ఆ వివరాల్లోకి వెళితే..
సవ్యంగా సాగుతున్న అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య దాంపత్య జీవితంలో కలతలకు అత్త జయబాదురి, మరదలు నవ్య నందా కారణమనే అంశంతో మొదలైంది. అత్తకోడల్లకు మధ్య గొడవలు, అలాగే వదిన మరదళ్ల మధ్య పడటం లేదనే విషయాలు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఇలాంటి కుటుంబంలో సర్వసాధారణమే.. అన్ని సర్దుకొంటాయని విషయాన్ని అందరూ ఊహించారు.

అయితే మరోసారి అభిషేక్, ఐశ్వర్య విడాకులకు కొత్త కారణం వినిపించింది. వారిద్దరి దాంపత్య జీవితంలో విభేదాలకు కారణం ఓ డాక్టర్. ఐశ్వర్యతో డాక్టర్‌కు ఉన్న రిలేషన్ వల్లే విడాకుల వరకు గొడవ వచ్చిందనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. ఓ డాక్టర్‌కు ఐశ్వర్య సన్నిహితంగా ఉంటున్నారనే విషయం హాట్ టాపిక్ అయింది.
ఐశ్వర్యకు డాక్టర్ మధ్య ఉన్న సంబంధం విషయంపై వార్తల మంటలు చల్లారకముందే.. అభిషేక్ అఫైర్ వ్యవహారం బయటకు వచ్చింది. ఓ యువ తారతో చోటా బచ్చన్ ప్రేమాయణం సాగిస్తున్నారనే విషయంతో ఈ డైవోర్స్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. బాలీవుడ్ నటి నమ్రత్ కౌర్‌తో బిగ్ బీ తనయుడు ప్రేమాయణం కొనసాగిస్తున్నాడనే విషయం ఇటీవల కాలంలో మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

ఇలాంటి రకరకాల గందరగోళాలు, రూమర్ల మధ్య అభిషేక్, ఐశ్వర్య విడాకులకు సిద్దమయ్యారు. వారిద్దరి గ్రే డైవోర్స్‌కు సిద్దమవుతున్నారు. సుదీర్ఘకాలం దాంపత్య జీవితం కొనసాగించి.. 50 ఏళ్లకుపై బడిన వారు తమ స్వేచ్ఛా జీవితం కోసం కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకోవడమే గ్రే డైవోర్స్ (Grey Divorce) అంటారు. ఇలాంటి సంస్కృతి పాశ్చాత్య దేశాల్లో ఉంది. ఇది ఇప్పుడు గొప్పింటి కుటుంబాల్లో కనిపిస్తున్నది అని సైకాలజిస్టులు పేర్కొంటున్నారు.
ఇండియాలోని వృద్దుల్లో విడాకుల సంస్కృతి పెరుగుతున్నది. అందుకు కారణం సామాజిక పరిస్థితులే. సాంప్రదాయంగా జరిగే పెళ్లిళ్లు సుదీర్ఘంగా సాగుతాయనే నమ్మకం సడలుతున్నది. వ్యక్తిగత అభిరుచులు, జీవన విధానం విడాకుల సంస్కృతికి దారి తీస్తున్నది. అందుకే 50 ఏళ్లకు పైబడిన వారిలో విడాకులు సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకొంటున్నాయి. వీటినే గ్రే డైవోర్స్ అంటారు అని చెప్పారు.


Click it and Unblock the Notifications











