పాకిస్థాన్ ప్రధానితో అందాల నటి రేఖ పెళ్లి ప్రయత్నాలు.. ఎక్కడ బెడిసి కొట్టిందంటే..

దేశం గర్వించదగిన నటి ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తొచ్చేది రేఖ. అందం, అభినయంతో ఆకట్టుకొన్న ఈ నటి జీవితంలో హ్యాపీ మూమెంట్స్‌తోపాటు బ్రేకప్స్ కూడా బాగానే ఉన్నాయి. అయితే అమితాబ్‌తో బ్రేకప్ తర్వాత పాకిస్థాన్ క్రికెటర్‌తో ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది. అయితే ఆ పెళ్లి ఎందుకు వర్కవుట్ కాలేదంటే..

ఘాటైన వయ్యారాలతో షాక్ ఇస్తున్న మోక్షిత రాఘవ్

దక్షిణాది నుంచి బాలీవుడ్‌కు

దక్షిణాది నుంచి బాలీవుడ్‌కు

దక్షిణాది నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన రేఖకు మంచి సినిమా బ్యాగ్రౌండ్ ఉంది. సావిత్రి భర్త జెమినీ గణేషన్, పుష్పవల్లి దంపతులకు పుట్టిన భానురేఖ గణేషన్ అందరికి రేఖగా సుపరిచితులు. తమిళనాడు నుంచి బాలీవుడ్‌కు వెళ్లి అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా అందలం ఎక్కింది.

 అమితాబ్‌తో ప్రేమలో

అమితాబ్‌తో ప్రేమలో

నటిగా రేఖ కెరీర్ ఉన్నత స్థితిలో ఉండగానే అమితాబ్ బచ్చన్‌తో ప్రేమలో పడింది. పీకల్లోతూ ప్రేమలో మునిగిన రేఖ, బిగ్‌బీ పెళ్లి చేసుకోవడం ఖాయమనే విషయం బాలీవుడ్‌లో బలంగా వినిపించింది. అనూహ్య పరిస్థితుల్లో జయబాధురిని అమితాబ్ పెళ్లాడటంతో రేఖ‌కు బ్రేకప్ జరిగింది.

ఇమ్రాన్ ఖాన్‌తో పీకల్లోతు ప్రేమలో

ఇమ్రాన్ ఖాన్‌తో పీకల్లోతు ప్రేమలో

ఆ తర్వాత క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌తో మళ్లీ ప్రేమలో పడింది. వారిద్దరి డేటింగ్ వ్యవహారం జాతీయ పత్రికల్లో పతాక శీర్షికల్లో కనిపించింది. అప్పటికే ఇమ్రాన్ ఖాన్‌తో జీనత్ ఆమన్‌కు అఫైర్ ఉందనే వార్తల మధ్య అనూహ్యంగా రేఖ పేరు తెరపైకి రావడం అందర్నీ ఆకట్టుకొన్నది.

పెళ్లి వరకు వచ్చిన వ్యవహారం

పెళ్లి వరకు వచ్చిన వ్యవహారం

ఇమ్రాన్, రేఖ మధ్య కెమిస్ట్రీ చూసి అనేక కథనాలు బాలీవుడ్‌ పత్రికల్లో వచ్చాయి ఇమ్రాన్ ఇన్‌స్వింగర్‌కు రేఖ బౌల్డ్ అయ్యారంటూ కథనాల్లో పేర్కొన్నారు. వారిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమనే వార్తలు కూడా బలంగా వినిపించాయి. ఇలాంటి వార్తలతో అప్పట్లో బాలీవుడ్ మార్మోగింది.

 ఇమ్రాన్‌తో పెళ్లికి రేఖ తల్లి గ్రీన్ సిగ్నల్

ఇమ్రాన్‌తో పెళ్లికి రేఖ తల్లి గ్రీన్ సిగ్నల్

ఇలాంటి వార్తల మధ్య రేఖ తల్లి పుష్పవల్లి కూడా ఇమ్రాన్‌ ఖాన్‌తో పెళ్లికి మొగ్గుచూపించిందంట. అప్పట్లో దేశంలోనే ప్రముఖంగా మారిన నాజోమీ అనే ఆస్ట్రాలజర్‌తో జాతకాలు చూపించిందట. అయితే చివరకు ఓ ముందుడుగు వేసి తమ కుటుంబంలోకి ఇమ్రాన్‌ను ఆహ్వానించేందుకు సిద్దమయ్యారట. అయితే ఇమ్రాన్, రేఖ మధ్యలో ఏం జరిగిందనే విషయం పక్కన పెడితే వారిద్దరూ విడిపోవడం అందర్నీ షాక్ గురిచేసింది.

ముఖేష్‌తో పెళ్లి.. భర్త సూసైడ్

ముఖేష్‌తో పెళ్లి.. భర్త సూసైడ్

ఇలాంటి బ్రేకప్‌ల తర్వాత తనకు స్నేహితుల ద్వారా పరిచయమైన పారిశ్రామిక వేత్త ముఖేష్ అగర్వాల్‌ను పెళ్లాడింది. ముఖేష్ ప్రపోజ్ మేరకు ఆయనను మార్చి 4వ తేదీ 1990న వివాహం చేసుకొన్నది. అయితే రేఖ లండన్‌లో ఉన్న సమయంలో ముఖేష్ అగర్వాల్ ఆత్మహత్య చేసుకోవడం ఆమె జీవితంలో మరో విషాదం చోటుచేసుకొన్నది. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే ఉంటున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X