Divorce ఐశ్వర్య రాయ్‌తో అభిషేక్ విడాకులు.. పూర్తి నిజాలు తెలిపే వాస్తవం ఇదే!
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్, మాజీ ప్రపంచ సుందరి, నటి ఐశ్వర్యరాయ్ దంపతులు విడిపోతున్నారనే వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. అయితే మీడియాలో చెలరేగుతున్న రూమర్లు, గాసిప్స్‌పై బిగ్ బీ ఫ్యామిలీ మౌనాన్ని వహిస్తుండటంతో ఈ అంశం మరింత రచ్చగా మారింది. అయితే వారిద్దరి విడాకులు తీసుకొంటున్నారా? విడిపోతున్నారా అనే వార్త ప్రచారంలో ఉన్న నేపథ్యంలో వారి రిలేషన్‌షిప్‌కు సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఐశ్వర్యరాయ్ జీవితంలో పలు అఫైర్ల వార్తల తర్వాత అభిషేక్ బచ్చన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉందనే విషయం మీడియాలో విస్త్రృతంగా ప్రచారమైంది. అయితే ఆ వార్తలకు బలం చేకూరేలా వారిద్దరూ ముంబైలో పలుచోట్ల చెట్టాపట్టాలేసుకొని దర్శనమిచ్చారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు డేటింగ్ చేసి 2007 సంవత్సరంలో ఏప్రిల్ 20వ తేదీన వారిద్దరి వివాహం చేసుకొన్నారు.

అయితే ఐశ్వర్య, అభిషేక్ దాంపత్య జీవితం కులాసాగానే సాగింది. వారిద్దరికి ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది. దాదాపు 16 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత ప్రస్తుతం వారిద్దరూ విడిపోతున్నారనే వార్త మీడియాలో ప్రచారం అవుతున్నది.

అభిషేక్, ఐష్ డైవోర్స్ వార్తల నేపథ్యంలో తాజాగా అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా, షారుక్ కూతురు సుహానా ఖాన్, శ్రీదేవీ కూతురు ఖుషీ కపూర్ నటించిన ది ఆర్చిస్ సినిమా ప్రీమియర్‌కు అభిషేక్ దంపతులు హాజరయ్యారు. ఆ సమయంలో కూడా బిగ్ బీ, జయ బచ్చన్ కూడా ఉన్నారు. దాంతో విడాకుల వార్త పుకార్లేనని భావించారు.

తాజాగా అభిషేక్, ఐష్ దంపతులు తమ కూతురు ఆరాధ్య చదువుతున్న ధీరూభాయ్ అంబానీ స్కూల్‌లో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు బిగ్ బీ కూడా తన మనవడు అగస్త్య నందాతో వచ్చారు.దాంతో వారి విడాకుల విషయంపై మరింత సందిగ్దాన్ని లేవనెత్తింది.


Click it and Unblock the Notifications











