Divorce: అభిషేక్‌తో విడాకులు.. సూపర్ ట్విస్ట్ ఇచ్చిన ఐశ్వర్య రాయ్!
బాలీవుడ్‌లో ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ విడాకుల గురించిన రూమర్ కొద్దికాలంగా జాతీయ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే భర్తతోనే కాకుండా తన మరదలు, అత్తతో గొడవల కారణంగా సపరేట్ కావాలని ఐశ్వర్య నిర్ణయం తీసుకొన్నదనే వార్త ట్రెండింగ్‌గా సాగింది. అయితే తాజాగా డైవోర్స్ వార్తలకు చెక్ పెట్టే విధంగా ఈ అందాల సుందరి ట్విస్ట్ ఇచ్చింది. ఆ ట్విస్ట్ వివరాల్లోకి వెళితే..
కొద్ది నెలల నుంచి ఐశ్వర్య, అభిషేక్ విడాకులు వ్యవహారం గురించి మీడియాలో సీరియల్‌గా వార్తలు వచ్చినప్పటికీ.. ప్రపంచంలో అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ ఇంటిలో జరిగిన వివాహం నేపథ్యంలో రూమర్లు ఊపందుకొన్నాయి. ఆనంత్ అంబానీ పెళ్లిలో అభిషేక్, తన ఫ్యామిలీతో రావడం.. ఐశ్వర్య, తన కూతురుతో వేర్వేరుగా రావడంతో అనుమానాలు మరింతగా బలపడ్డాయి.

ఇక ఇటీవల ఐశ్వర్య రాయ్ తన వెడ్డింగ్ రింగ్‌ను ధరించకపోవడంతో మరోసారి విడాకుల రూమర్ భగ్గుమన్నది. అభిషేక్‌తో ఆమె బంధాన్ని తెగతెంపులు చేసుకొన్నది. ఇక అధికారిక ప్రకటనే తరువాయి అనే విధంగా వార్తలు వచ్చాయి. అప్పటి వరకు వస్తున్న రూమర్లకు ఇలాంటి వార్తల మరింత బలం చేకూర్చింది.
అయితే తాజాగా వెడ్డింగ్ రింగ్ ధరించకపోవడంతో వచ్చిన వార్తలకు ఐశ్వర్య పుల్‌స్టాప్ పెట్టింది. పారిష్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా ఆమె తన కూతురుతో కలిసి కినిపంచింది. ఫ్యాషన్ వీక్ సందర్భంగా తన చేతికి వెడ్డింగ్ రింగ్ ధరించి కనిపించి ఆ రూమర్లకు తెర దించే ప్రయత్నం చేసింది. దాంతో భగ్గమంటున్న విడాకుల వార్తలపై నీళ్లు చల్లేలా చేసింది.

అయితే ఇటీవల కాలంలో అభిషేక్, ఐశ్వర్య మధ్య పెరిగిన దూరం తగ్గింది. అందుకు కారణం నవ్య నందా బచ్చన్ తన తల్లిదండ్రుల ఇంటి నుంచి బయటకు వెళ్లింది. దాంతో వారి మధ్య విభేదాలు సమసిపోయాయనే వార్త బాలీవుడ్ మీడియాలో కనిపించింది. వారి దాంపత్య జీవితం మళ్లీ గాడిన పడుతుందనే వార్తలు వస్తున్నాయి.
ఐశ్వర్య రాయ్ కెరీర్ విషయానికి వస్తే.. ఆ ప్రపంచ సుందరి వెండితెరపైన కనిపించి చాలా కాలమైంది. కానీ ప్రస్తుతం నటించిన బీ హ్యాపీ మూవీ నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానున్నది. గుండెను కదిలించే తండ్రి, కూతుళ్ల ఎమోషనల్ బంధంతో రూపొందే డ్యాన్స్ డ్రామా చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











