ఫాల్తూ హీరోతో భూమి పడ్నేకర్ రొమాన్స్.. పట్టపగలే కారులో..

బాలీవుడ్‌లో అందాల తార భూమి పడ్నేకర్ గురించి రూమర్లు రావడం కొత్తేమీ కాదు. ఎప్పుడూ అఫైర్లు, డేటింగ్ వార్తలతో సెన్సేషనల్‌గా నిలుస్తుంటుంది. తాజాగా హిందీ చిత్ర సీమలోని ఓ యువ హీరోతో చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నట్టు బాలీవుడ్ పత్రిక కథనాన్ని వెల్లడించింది. ఫాల్తూ సినిమా హీరో జాకీ భగ్నానీతో రొమాన్స్ చేస్తున్నట్టు కథనంలో పేర్కొన్నారు. వారిద్దరి రొమాన్స్ గురించి బాలీవుడ్ కోడై కూస్తున్నదని బాలీవుడ్ పత్రిక వెల్లడించింది. ఇటీవల నేరుగా మీడియా కంటికి చిక్కిందని తెలుపుతూ..

హీరోయిన్ భూమి పడ్నేకర్ ఇటీవల ఓ వాహనంలోకి దూరింది. ఆ కారు ఆమెకు చెందిన కాదు. జాకీ భగ్నాని కారు అని మీడియా ధృవీకరించింది. ఇప్పుడు ఈ జంట గురించి బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తున్నది. ఇటీవల ఇండియా టుడే మైండ్ రాక్స్ 2017లో అఫైర్ గురించి ప్రస్తావించగా.. నాపై డేటింగ్ గురించి వస్తున్న రూమర్లలో ఎలాంటి వాస్తవం లేదు. ఇప్పుడు నా రిలేషన్‌షిప్ కేవలం సినిమాలతోనే, నా దృష్టంతా కేవలం కెరీర్‌పైనే అని భూమి చెప్పింది.

Is Bhumi Pednekar dating Faltu hero Jackky Bhagnani

ఇదిలా ఉండగా, తన సహచర నటుడు ఆయుష్మాన్ ఖురానా ఇటీవల మాట్లాడుతూ.. భూమి పడ్నేకర్ డేటింగ్ చేస్తున్నటి.. ఎలాంటి వ్యక్తులతో రిలేషన్ పెట్టుకోవాలనే విషయంపై నేను ఆమెకు ఓ సలహా కూడా ఇచ్చానని చెప్పడంతో డేటింగ్ వార్తలు నిజమేననే విషయం స్పష్టమైంది.

ఇక భూమి పడ్నేకర్ కెరీర్ విషయానికి వస్తే, ఆయుష్మాన్ ఖురానాతో కలిసి బాలా అనే చిత్రంలో నటిస్తున్నది. ఇంకా ఈ చిత్రంలో యామీ గౌతమ్, సౌరభ్ శుక్లా, జావేద్ జాఫ్రీ, సీమా తదితరులు నటిస్తున్నారు. బాలా చిత్రం నవంబర్ 22న రిలీజ్‌కు సిద్దమవుతున్నది.

Recommended Video

Bhumi Pednekar Birthday Celebrations Went Viral | Filmibeat Telugu

ఇక జాకీ భగ్నాని విషయానికి వస్తే, కల్ కిస్నే దేఖా చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. మిత్రన్ సినిమాలో చివరిసారిగా కనిపించారు. ఫాల్తూ, అజయ్ గజబ్ లవ్, రంగ్రేజ్, యంగిస్థాన్ తదితర చిత్రాలు జాకీకి మంచి గుర్తింపునిచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X