యానిమల్‌కు ముందు బాబీ డియోల్ సూసైడ్ అటెంప్ట్ చేశాడా? సందీప్ రెడ్డి వంగా లేకపోతే!

సినిమా పరిశ్రమలో యాక్టర్ల పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఈ రోజు టాప్ రేంజ్‌లో ఉన్న స్టార్స్.. కాలం కలిసి రాకపోతే కనుమరుగైపోయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అలాంటి అనిశ్చితి ఎక్కువగా ఉండే ఈ పరిశ్రమలో కొన్నిసార్లు ఆత్మహత్యలు కూడా అభిమానులను విషాదంలోకి నెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే యానిమల్ సినిమాతో టాప్ యాక్టర్‌గా, బిజీ విలన్‌గా మారిన బాబీ డియోల్ కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారనే విషయాన్ని ఇటీవల ఓ దర్శకుడు బయటపెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్‌లో లెజెండరీ ఫ్యామిలీ డియోల్ నుంచి ధర్మేంద్ర కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాబీ డియోల్ ఆదిలో బాగానే సక్సెస్ అందుకొన్నారు. ధరమ్ వీర్ సినిమాతో బాలనటుడిగా కనిపించినప్పటికీ.. బర్సాత్ సినిమాతో హీరోగా మారి బ్లాక్ బస్టర్ అందుకొన్నాడు. ఆ తర్వాత వచ్చిన గుప్త్ సినిమా మరో ఘన విజయాన్ని అందించింది. ఆ తర్వాత ఒకట్రెండు సినిమాలు మిస్ అయినా మళ్లీ సోల్జర్, దిల్లగీ సినిమాతో హిట్స్ అందుకొన్నారు.

Is Bobby Deol Attempted Suicide before offer of Animal Blockbuster by Sandeep Reddy Vanga

బాబీ డియోల్ కెరీర్ బాగానే ఉందనే ఫీలింగ్‌తో ఉన్న సమయంలో ఆయనకు వరుస ఫ్లాప్‌లు ఎదురయ్యాయి. బిచ్చు, ఆషీక్, అజ్నబీ, క్రాంతి, హమ్ రాజ్, చోర్ మాచాయే షోర్ అలా వరుస బెట్టి సినిమాలు పరాజయాల వైపు క్యూ కట్టాయి. అడపదడపా సినిమాలు చేతికి వచ్చినా సక్సెస్ రేట్ శూన్యంగా మారింది. దాంతో నిర్మాతలందరూ ముఖం చాటేశారు. దాంతో ఆయన పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు.

ఇక భార్య సంపాదనతోనే చాలాకాలం నెట్టుకొచ్చారు. హీరోగా మంచి సినిమాల్లో నటించినా.. పిల్లల నుంచి ఎలాంటి రెస్పెక్ట్ లేదు. సినిమాలు చేయాలని ఫ్యామిలీ నుంచి ఒత్తిడి. తాను ఫోటోషూట్స్ చేసి నిర్మాతలకు పంపిస్తే.. బాగున్నాయి అని చెప్పడమే కానీ.. ఎలాంటి స్పందన వారి నుంచి కనిపించకపోయే సరికి మరింత డిప్రెస్ అయ్యాడు. ఆ సమయంలో ఆయన సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చిందని తాజాగా ఓ తెలుగు డైరెక్టర్ తన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

తాజాగా తన సినిమా ప్రమోషన్‌లో తెలుగు డైరెక్టర్ మాట్లాడుతూ.. బాబీ డియోల్‌తో మాట్లాడుతుంటే చాలా ఎమోషనల్ అవుతాడు. సందీప్ రెడ్డి వంగా పేరు చెబితే కంటతడి పెట్టుకొంటాడు. యానిమల్ సినిమాలో విలన్ రోల్‌ ఇచ్చి తన జీవితానికి పునర్జన్మను ఇచ్చాడని చెబుతుంటాడు. సందీప్ అంటే ఆయనకు అమితమైన గౌరవం ఏర్పడింది. ఆయన ఆఫర్ ఇవ్వకపోతే నా జీవితం మరోలా ఉండేది. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని చెబుతుంటాడని అన్నారు.

యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత హిందీలోనే కాకుండా సౌత్ నుంచి భారీ ఆఫర్లు బాబీ డియోల్‌ను పలకరించాయి. ఇటీవల వచ్చిన కంగువా, తాజాగా రిలీజైన డాకు మహారాజ్‌తో మంచి ప్రశంసలు అందుకొన్నాడు. ఇక పవన్ కల్యాణ్‌తో హరిహర వీరమల్లు, హిందీలో హౌస్‌ఫుల్ 5, ఆల్ఫా, దళపతి 69, విక్రమ్ 2, డ్రాగన్ అనే సినిమాల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X