నిర్మాత సూసైడ్‌లో సంచలన ట్విస్టు.. మరణానికి ముందు వీడియో షూట్.. చివరి కోరిక ఏమిటంటే?

బాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్య హిందీ సినిమా పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆయన మరణం మిగిల్చిన విషాదాన్ని నుంచి బయటపడలేకపోతున్నారు. ముందు రోజు వరకు నవ్వుతూ అందరితో కలుపుగోలుగా మాట్లాడిన నిర్మాత నితిన్ దేశాయ్ ఇక లేరంటే నమశక్యంగా లేదంటూ భోరుమంటున్నారు. అయితే నితిన్ దేశాయ్ మరణం వెనుక అనేక అనుమానాలు, సందేహాస్పద కోణాలు బయటకు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

నితిన్ దేశాయ్ అసలు పేరు నితిన్ చంద్రకాంత్ దేశాయ్. మహారాష్ట్రలోన ములంద్‌లో జన్మించారు. ముంబై ఫిలిం సిటీలో ఆర్ట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. గోవింద్ నిహలానీ దర్శకత్వం వహించిన తమస్ సీరియల్ కోసం పనిచేశారు. ఆ తర్వాత విధూ వినోద్ చోప్రా రూపొందించిన 1942: ఏ లవ్ స్టోరి చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసి బాలీవుడ్‌లోకి ప్రవేశించారు.

Nitin Desai

మరాఠీ, హిందీ సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన హమ్ దిల్ దే చుకే సనమ్, లగాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రాలకు పనిచేశారు. అశుతోష్ గోవారికర్, విధూ వినోద్ చోప్రా, రాజ్ కుమార్ హిరాణీ, సంజయ్ లీలా భన్సాలీ లాంటి దర్శకులతో పనిచేశారు.

అయితే ముంబైలోని కర్జత్‌లో ఎన్ డీ అనే స్టూడియోను నిర్మించేందుకు సిద్దమయ్యారు. అయితే ఆ స్డూడియో నిర్మాణానికి తాను సంపాదించిన సొమ్మునంతా ఖర్చు చేశారు. దాదాపు 150 కోట్లతో స్టూడియో కోసం పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత రుణం అవసరం కావడంతో భారీగా అప్పు చేశారు. అయితే రుణం ఇచ్చిన కంపెనీ ఆయనపై కేసు నమోదు చేసింది.

Nitin Desai

తనపై రుణం ఇచ్చిన కంపెనీ కేసు నమోదు చేయడంతో అవమానంగా భావించారు. కొద్ది రోజులుగా ఆయన తీవ్ర మానసిక సంక్షోభానికి గురయ్యారు. దాంతో తీవ్ర డిప్రెషన్‌కు గురయ్యారు. దాంతో కొద్ది రోజులుగా తన స్టూడియోలో ఒంటరిగా గడుపుతున్నారు. తన మరణానికి ముందు రోజు కూడా అందరితో సంతోషంగా గడిపారని సన్నిహితులు తెలిపారు.

నితిన్ దేశాయ్ కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. మంగళవారం రాత్రి సెక్యూరిటీని పిలిచి.. నాకు ఇక్కడే పని ఉంది. మీరు వెళ్లమని సెక్యూరిటీ వద్ద నుంచి తాళం చెవులు తీసుకొన్నారు. ఆ తర్వాత తెల్లవారి ఉదయాన్నే స్టూడియో నంబర్ 10లో ఉరి వేసుకొని మరణించారు. అయితే ఉరి వేసుకొనే ముందు వీడియో షూట్ చేశారని తెలిసింది. ప్రస్తుతం ఆ వీడియో పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Nitin Desai

అయితే తన సూసైడ్ లెటర్‌లో తన అంత్యక్రియలను ఎన్‌డీ స్టూడియోలో నిర్వహించాలని కోరినట్టు సమాచారం. నితిన్ దేశాయ్ పిల్లలు అమెరికాలో ఉన్నందున అంత్యక్రియలు ఆలస్యం అయ్యాయి. ఆయన కుమారులు అమెరికా నుంచి వచ్చిన తర్వాత శుక్రవారం అంత్యక్రియలను నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X