నిన్న నిధి అగర్వాల్‌తో.. నేడు మరో ఇద్దరితో.. యంగ్ క్రికెటర్ రొమాంటిక్‌గా!

Recommended Video

Is KL Rahul Dating Athiya Shetty,Daughter Of Suniel Shetty ? || Filmibeat Telugu

భారత క్రికెట్ జట్టులో టాలెంటెడ్ ఆటగాళ్లలో కేఎల్ రాహుల్. మైదానంలో దిగాడంటే ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించడం ఖాయం. అలాంటి క్రికెటర్ మైదానంలోనే కాదు.. లావ్ ట్రాక్‌లోను తానేమీ తక్కువ తినలేదని నిరూపిస్తున్నాడు. ఇటీవల కాలంలో ఈ యువ క్రికెటర్‌కు సినీ తారలతో లింక్‌లు భారీగానే వస్తున్నాయి. గతంలో ఓ నటితో డేటింగ్ వార్తలు రాగా, తాజా ప్రముఖ హీరో సునీల్ శెట్టి కూతురుతో అఫైర్ అంటూ వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

గుప్పుమన్న డేటింగ్ వ్యవహారం

గుప్పుమన్న డేటింగ్ వ్యవహారం

కేఎల్ రాహుల్ ఆటతోనే కాదు.. అఫైర్లతోనూ మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నాడు. గతంలో నిధి అగర్వాల్, సొనాల్ చౌహాన్‌తో డేటింగ్ అంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదు. అంతా రూమర్లే అని క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా ఈ కుర్ర క్రికెటర్ అతియాశెట్టి, ఆకాంక్ష రంజన్ కపూర్‌తో కలిసి రొమాంటిక్‌గా కనిపించడంతో మరోసారి మీడియా హెడ్‌లైన్లలో కనిపించాడు. అయితే ఇద్దరిలో ఎవరితో రిలేషన్ అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

నిధి అగర్వాల్ ఏమన్నారంటే

నిధి అగర్వాల్ ఏమన్నారంటే

రాహుల్‌తో రిలేషన్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ స్పందిస్తూ.. అవును.. రాహుల్‌తో కలిసి డిన్నర్ డేట్‌కు వెళ్లాను. చాలా కాలంగా కలిసి తిరుగుతున్నాం. మేము టీనేజ్‌లో ఉన్నప్పటి నుంచి రాహుల్ నాకు పరిచయం. బెంగళూరులో కలిసి పెరిగాం. క్రికెటర్ కాకముందు నుంచి నాకు తెలుసు. ఆయన క్రికెటర్ అయ్యాడు.. నేను నటిని అయ్యాను. అంత మాత్రాన మా మధ్య అఫైర్ ఉందని భావిస్తే ఎలా అని నిధి అన్నారు.

లండన్‌కు ఆకాంక్ష రంజన

లండన్‌కు ఆకాంక్ష రంజన

కాగా ఇటీవల ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌లు చూడటానికి ఆక్షాంక్ష ఇంగ్లాండ్‌కు వెళ్లడంతో మరోసారి డేటింగ్ వ్యవహారం చర్చకు వచ్చింది. ఆకాంక్ష వెళ్లింది కేవలం రాహుల్ కోసమంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ వారి మధ్య రిలేషన్ అంతగా సీరియస్‌గా లేదని, కేవలం స్నేహం, సన్నిహితమైన సంబంధాలు మాత్రమే ఉన్నాయి అని పత్రికలు పేర్కొన్నాయి. అలియాభట్‌కు అత్యంత స్నేహితురాలైన ఆకాంక్ష త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

అతియా శెట్టితోనే డేటింగ్‌

అతియా శెట్టితోనే డేటింగ్‌

తాజాగా బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టితోనే కేఎల్ రాహుల్ డేటింగ్ చేస్తున్నాడు. ఆకాంక్ష రంజన్ కపూర్‌తో కాదు అని ఓ ఆంగ్ల వెబ్‌సైట్ వివరణ ఇచ్చింది. వారిద్దరూ కలిసి చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారు. గత ఫిబ్రవరి నుంచి భలే రంజుగా డేటింగ్ వ్యవహారం సాగుతున్నది. వారి ఇద్దరి మధ్య బంధం ఇటీవల మరింత ధృడపడింది అని కథనంలో పేర్కొన్నారు. అయితే అతియా, ఆకాంక్ష ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్ కావడం కొసమెరుపు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X