ఫాతిమా సనా షేక్‌కు చేదు అనుభవం.. దంగల్ బ్యూటీని కెలికిన తెలుగు దర్శకుడు ఎవరు?

ఇండియన్ సినిమా దగ్గర ఇపుడు పలు పాన్ ఇండియా సినిమా రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ ఉండొచ్చు. అయితే దీనికి కట్టాల్సిందేనా.. అన్ని భాషల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా సపోర్ట్ కావాల్సి ఉంది. అయితే దాదాపు ఒక్క భాషలోనే ఇండియన్ సీమ దగ్గర ఇప్పటికీ హైయెస్ట్ గ్రాసర్ గా ఉన్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది బాలీవుడ్ స్టార్ నటుడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం "దంగల్" అనే చెప్పాలి.

కాగా ఇపుడు పాన్ ఇండియా సినిమాల్లా వందల కోట్ల బడ్జెట్ లేకుండానే ఒక సింపుల్ సినిమాగా వచ్చిన ఈ సినిమా ఏకంగా 2000 వసూళ్లు అందుకొని చరిత్ర సృష్టించింది. కాగా ఈ సినిమాలో అమీర్ ఖాన్ తో పాటుగా తన కూతురు పాత్రలో కనిపించిన ప్రముఖ నటి ఫాతిమా సనా షైక్ కి కూడా మంచి మార్కులు వచ్చాయి. ఆ రోల్ కోసం తన జుట్టు కూడా కత్తిరించుకొని చూపించిన డెడికేషన్ అంతా ఇంతా కాదు.

Is dangal beauty Fatima Sana Shaikh faced casting couch effect from Telugu Film Industry s Director

అలాగే రెజ్లర్ గా కూడా ఎంతో కష్టపడిన తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని చెప్పుకొచ్చింది. అది కూడా సౌత్ సినిమా నుంచే ఆమె ఊహించని విధంగా ఈ వేధింపులు ఎదుర్కొన్నట్టుగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు చెప్పుకొచ్చింది. తాను సౌత్ లో ఒక సినిమా విషయంలో జరిగిన ఘటన కోసం చెప్పుకొచ్చింది.

కాగా ఆ సమయంలో తనకి కాస్టింగ్ డైరెక్టర్ ఇంకా ప్రొడుక్ర్స్ ని కలవక ముందే తనకి అతడు పట్టు పట్టి మరీ నాకు మీరు ఏం చెయ్యడానికి అయ్యిన సిద్ధంగా ఉండాలి అంటూ చెప్పాడు, ఏమైనా చెయ్యాలి అంటూ చెప్పాడు. అపుడు తాను సినిమాలో రోల్ కోసం ఎంతైనా కష్టపడతా అందుకు సిద్ధమే అని చెప్పినప్పటికీ అతను ఇంకా చెప్తున్నాడు దానితో నేను కూడా రెడీనే అన్నట్టుగా అతను ఆ మేటర్ ని ఎంతవరకు సాగదీస్తాడు అని కొనసాగించాను అని చెప్పుకొచ్చింది.

అలాగే హైదరాబాద్ లో జరిగిన మరో సంఘటన కోసం కూడా తాను తెలిపింది. ఓ ప్రొడ్యూసర్స్ తో మాటల్లో అతడు తనని కమిట్మెంట్ ఇవ్వాలి అన్నట్టుగా హింట్ ఇచ్చేవాడు అని అదంతా చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు కానీ నాకు వాళ్ళేం చెప్పాలి అనుకుంటున్నారో అర్ధం అయ్యింది అంటూ కామెంట్స్ చేసింది. మీరు అసలైన వ్యక్తులని కలవాలి అంటే మీరు ఇది చెయ్యాలి అన్నట్టుగా వారు చెప్పేవారని తెలిపింది.

అయితే అందరూ ఇలానే లేరని కానీ ఇలాంటి చేదు అనుభవాలు తప్పవని అది హీరోలు లేదా హీరోయిన్స్ విషయంలో అయినా కూడా ఇలా జరగకూడదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి వారి అనుభవాలు విన్నా కూడా బాధ గానే ఉంటుంది అని ఫాతిమా చెప్పుకొచ్చింది. ఇలా తనకైతే దక్షిణాది సినిమాలో ఎదురైన ఊహించని ఘటన సినీ వర్గాల్లో వైరల్ గా మారింది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X