twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంగన రనౌత్‌కు చేదు అనుభవం.. కారును అడ్డగించి మూకుమ్మడిగా దాడి?

    |

    బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది. సిక్కుల మనోభావాలను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినందుకు ఇటీవల కంగన రనౌత్‌పై కేసు నమోదు చేయడం తెలిసిందే. ఆ అంశంపై కొద్ది రోజులుగా కంగనపై సిక్కు మతస్థులు గుర్రుగా ఉన్నారు. ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తుండటం తెలిసిందే. అయితే తాజాగా అంటే డిసెంబర్ 3వ తేదీన ఆమె పంజాబ్‌లో పర్యటిస్తుండగా కొందరు మూకుమ్మడిగా దాడి చేశారు. దాంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొన్నది.

    తనపై జరిగిన దాడి ఘటనపై కంగన రనౌత్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. పంజాబ్‌లో తాను పర్యటిస్తున్న సమయంలో నా కారుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రైతులమని చెప్పుకొంటూ నాపై దాడికి ప్రయత్నించారు అని ఓ వీడియోను కూడా కంగన రనౌత్ పోస్టు చేసింది.

    Is Farmers attacked Kangana Ranauts car in Punjab?

    అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి తెచ్చిన కొన్ని రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల గురించి కంగన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు సెన్సేషనల్‌గా మారింది. రైతులు పేరుతో చేస్తున్న వారంతా ఖాలీస్థాన్ ఉగ్రవాదులు.. అది రైతు ఉద్యమం కాదు. దేశాన్ని విచ్చిన్నం చేయడానికి చేసిన ఖాలీస్థాన్ ఉద్యమం అంటూ కంగన తన పోస్టులోపెట్టింది.

    అయితే కంగన రనౌత్‌ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ చేసిన ఫిర్యాదు మేరకు ఖార్ సబర్బన్ పోలీసులు కేసు నమోదు చేసింది. కంగనపై ఐపీసీ సెక్షన్ 295ఏ ప్రకారం కేసు నమోదు చేశారు. మత నమ్మకాలను, మతాన్ని కించపరిచే విధంగా ఉద్దేశపూర్వకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేశామని ఖార్ పోలీసులు పేర్కొన్నారు.

    కంగనపై కేసు నమోదు నేపథ్యంలో సిక్కు మత సంఘం నేత మంజిదర్ సింగద్ సిర్సా, శిరోమణి అకాళీదళ్ నేతలు ఇటీవల మహారాష్ట్ర హోంశాఖ మంత్రి దిలీప్ వాల్సే పాటిల్‌ను, మహారాష్ట్ర పోలీసులను కలిసి ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు.

    కంగన రనౌత్‌ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ చేసిన ఫిర్యాదు మేరకు ఖార్ సబర్బన్ పోలీసులు కేసు నమోదు చేసింది. కంగనపై ఐపీసీ సెక్షన్ 295ఏ ప్రకారం కేసు నమోదు చేశారు.

    ఇలాంటి పరిస్థితుల్లో కంగన కారుపై పంజాబ్‌లో దాడి జరిగినట్టు చెప్పడం వివాదాస్పదంగా మారింది. అయితే కంగనపై దాడికి ప్రయత్నించిన వారిని గుర్తించి ఎలాంటి చర్యలు తీసుకొంటారో వేచి చూడాల్సిందే.

    English summary
    Kangana Ranaut Shared a video on her Instagram story she wrote, “As I entered Punjab a mob has attacked my car… they are saying they are farmers”. Earlier, A case filed on Actress Kangana Ranaut comments on Kisan Morcha. As per reports, FIR registered against actor Kangana Ranaut in Mumbai for allegedly portraying the farmers' protest as Khalistani movement and calling them 'Khalistanis' on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X