మరో బాలీవుడ్ సుందరి పెళ్లికి రెడీ.. బాయ్‌ఫ్రెండ్‌తో మ్యారేజ్!
బాలీవుడ్‌లో పెళ్లి సంబురాలు జోరందుకున్నాయి. దీపికా పదుకోన్-రణ్‌వీర్ సింగ్ పెళ్లి ముగియగానే త్వరలోనే ప్రియాంక చోప్రా-నిక్ జోనస్ వివాహానికి బాజాలు మోగడానికి సిద్దంగా ఉన్నాయి. ఇక కమెడియన్ కపిల్ శర్మ పెళ్లి కూడా డిసెంబర్ నెలలోనే కానున్నది. అదే బాటలో బాలీవుడ్ నటి ఫైడా పింటో పెళ్లికి మార్గం సగమమైందనే మాట వినిపిస్తున్నది.

ప్రేమలో పడ్డ ఫ్రైడా పింటో
ప్రపంచ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొన్న స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంతో అందాల తార ఫ్రైడా పింటో మెరిసిన సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా అడ్వెంచర్ ఫొటోగ్రాఫర్ కోరి ట్రాన్‌తో అఫైర్ పెట్టుకొన్నది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్నది.

బాలీవుడ్‌లో జోరుగా కథనాలు
ఫ్రైడా పెళ్లికి ఆరాటపడుతున్నది. వారిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకొంటున్నారు. కోరి ఇటీవలే పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా ఫ్రైడా ఓకే చెప్పింది. ఫ్రైడా, క్రోని ఇద్దరూ వచ్చే ఏడాదిలో చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకొన్నారు అని ఓ పత్రిక తన కథనంలో పేర్కొన్నది.

ఫ్రైడా, కోరిని కలిపింది
ఫైడా సహనటుడు, కోరికి ప్రాణ స్నేహితుడు ఆరోన్ పాల్ ఇద్దరి ప్రేమలో కీలకంగా వ్యవహరించాడు. వారిద్దరిని ఒకరికొకర్ని పరిచయం చేసింది కూడా ఆయనే. చాలా కాలంగా వ్యక్తిగత జీవితాన్ని జాగ్రత్తగా చూసుకొంటూ రిలేషన్‌షిప్‌కు దూరంగా ఉంటుంది. కానీ కోరి ప్రతిపాదనను కాదనలేకపోయింది అని బాలీవుడ్ పత్రిక వెల్లడించింది.

ఫ్రైడా పింటో బర్త్ డే మెసేజ్
ఇటీవల తన ప్రియుడు కోరి ట్రాన్ జన్మదినం సందర్భంగా ఫీల్‌గుడ్ మెసేజ్‌ను పోస్టు చేసింది. హృదయం నిండా ఒకరు నిండిపోయి ఉంటే వారు ఎంత అదృష్టవంతులో చెప్పనక్కర్లేదు. నా ఆరాధించే వ్యక్తికి ప్రేమతో కూడిన ముద్దులు. నీ జీవితంలో ప్రతీ రోజు ఓ పండుగలా మారిపోయాలి. హ్యాపీ బర్త్ డే అంటూ ఫ్రైడా పోస్ట్ చేసింది.

స్లమ్ డాగ్ మిలియనీర్‌తో
స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంతో ఫ్రైడా పింటో తన సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత భారతీయ నేపథ్యమున్న ఆంగ్ల చిత్రాల్లోను నటించి మెప్పించింది. తాజాగా బాలీవుడ్‌లో లవ్ సోనియా అనే చిత్రంలో కనిపించింది. ఇప్పటి వరకు సుమారు 30 చిత్రాల్లో నటించింది.


Click it and Unblock the Notifications











