Divorce: భార్యకు విడాకులిస్తున్న స్టార్ హీరో.. 38 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్‌బై!
సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలు, హీరోయిన్ల విడాకుల వార్తలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. చక్కగా సాగుతుందని భావించిన సెలబ్రిటీలు షాక్ ఇస్తూ డైవోర్స్‌కు సిద్దమవుతున్నారు. తాజాగా సినిమా పరిశ్రమలో సుమారుగా 4 దశాబ్దాల దాంపత్య జీవితాన్ని ఆస్వాదించిన స్టార్ కపుల్ ప్రస్తుతం వేర్వేరుగా జీవిస్తుండటం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. అయితే ఆ స్టార్ హీరో భార్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన షాకింగ్ వివరాల్లోకి వెళితే..
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్ చిత్రాలతో అలరించిన హీరో గోవిందా. అప్పటికే టాప్ స్థానంలో ఉన్న అమితాబ్ లాంటి హీరోల ముందు చిన్న నటుడిగా తన ప్రస్తావాన్ని ప్రారంభించారు. చిన్న చిన్న ఎదుగుతూ స్టార్ హీరోగా మారారు. అయితే తన కెరీర్‌తోపాటు లవ్ జర్నీని తన ప్రస్తుత జీవిత భాగస్వామి సునీతా అహ్లుజాతో కొనసాగించారు. ఆమెను 1987 మార్చి 11వ తేదీన వివాహం చేసుకొన్నారు.

గోవిందా సినీ, రాజకీయ జీవితంలోను అలాగే జయాలు, పరాజయాల సమయంలో సునీత అహ్లుజా అండగా ఉన్నారు. వారిద్దరి మీడియాలోకి కనిపించినా.. ఏదైనా ఈవెంట్‌లో కనిపించినా అన్యోన్యంగా ఉండేవారు. గోవిందా, తన భార్య మధ్య కెమిస్ట్రీ చక్కగా ఉండేదనిపించింది. అయితే ఇటీవల వారిద్దరి మధ్య విభేదాలు బయట పడ్డాయి.
గోవిందా చుట్టు ఉండే మనుషులు సరైన వారు కాదు. ఆయన ఎప్పుడు మా ఇంట్లో కాకుండా ఎదురింటిలోనే ఉండేవారు. తన చుట్టు ఉండేవారితోనే ముచ్చట్లతో మునిగిపోయే వారు. ఫ్యామిలీని పట్టించుకొనే వారు కాదు. ఆయనకు మంచి కెరీర్‌ను ఇచ్చిన డేవిడ్ ధావన్‌కు వ్యతిరేకంగా తప్పుడు మాటలు చెప్పి ఆయనను దూరం చేశారు. నాకు అది అసలు నచ్చలేదు అని సునీత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆవేశంగా వెల్లగక్కింది.
సునీత మీడియాతో మాట్లాడుతూ.. జీవితంలో ఎప్పుడూ మగవాళ్లను నమ్మకూడదు. ఊసరవెళ్లి మాదిరిగా రంగులు మారుస్తుంటారు. ఇదే విషయాన్ని పదే పదే చెబుతుంటాను. గతంలో నేను చాలా సెక్యుర్‌గా ఉండేదానిని. ఇప్పుడు 60 ఏళ్ల వయసులో ఏదో తెలియని అభద్రతాభావానికి గురి అవుతున్నాను. అతడు పరిస్థితి మారింది. ఎప్పుడు ఏం చేస్తాడో తెలియని పరిస్థితి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

సునీత ఇంటర్వ్యూ తర్వాత మీడియాలో భారీ రూమర్లు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. గోవిందా, తన భార్యతో విడిపోతున్నారు. 38 ఏళ్ల వైవాహిక జీవితం ముగియనుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిద్దరి తమ విభేదాలను పరిష్కరించకొంటారా? లేదా వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











