37 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్ బై.. భార్యకు స్టార్ హీరో విడాకులు.. కాపురంలో ఆ హీరోయిన్ చిచ్చు!

సినిమా పరిశ్రమలో విడాకుల వ్యవహారాలు, పెళ్లి ముచ్చట్లు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఎప్పడూ బ్రేకప్స్, అఫైర్ వార్తలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. గత కొద్ది రోజులుగా మీడియాలో స్టార్ హీరో విడాకుల వార్త వైరల్ అవుతున్నది. అయితే ఆ ఫ్యామిలీ గానీ, హీరో సన్నిహిత వర్గాలు గానీ.. ఈ వార్తపై స్పందించడానికి నిరాకరించారు. అయితే తాజాగా ఈ వార్తను పలు బాలీవుడ్ మీడియాలో కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఆ హీరో వైవాహిక జీవితానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

హీరో గోవిందా నటుడిగా స్థిరపడుతున్న సమయంలో తన సమీప బంధువు సునీత ముంజల్‌తో ప్రేమలో పడ్డారు. వారిద్దరూ గాఢంగా ప్రేమించుకొన్నారు. పంజాబీ, నేపాలి ఫ్యామిలీకి చెందిన సునీతను గోవిందా 1987 మార్చి 11వ తేదీన వివాహం చేసుకొన్నారు. అయితే వీరి వివాహం మాత్రం 4 ఏళ్ల పాటు బయట ప్రపంచానికి తెలియకుండా సీక్రెట్‌గా ఉంచారు. ఆ తర్వాత సునీత అహుజాగా బాలీవుడ్‌కు పరిచయం చేశారు.

Is Govinda heading for divorce with wife Sunitha to end 37 years marriage life

సునీతాతో గోవిందా వైవాహిక జీవితం సుఖ:శాంతులతో సాగింది. గోవిందాకు అండగా, తన కెరీర్ ఎదుగుల విషయంలో తన వంతు సహకారం అందించారు. గోవిందా, సునీతకు ఇద్దరు సంతానం. ఒకరు టీనా అహుజా, యశ్వర్ధన్ అహుజా కొడుకు ఉన్నారు. వీరిద్దరూ కూడా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. స్టార్స్‌గా తమ ప్రతిభను చాటుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే సవ్యంగా దాంపత్య జీవితం కొనసాగుతుందనే అని అభిమానులు అనుకొంటుండగా.. గోవిందా, సునీత మధ్య వైవాహిక పరమైన సమస్యలు ఉన్నాయనే విషయం బయటకు వచ్చింది. భార్య సునీత స్వయంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ.. మేమిద్దరం సపరేట్‌గా జీవితాన్ని లీడ్ చేస్తున్నాం. మాకు రెండు బంగ్లాలు ఉన్నాయి. ఒక దానిలో నేను, మరో దానిలో గోవింద ఉంటున్నారు అనే విషయం చెప్పింది. దాంతో వారిద్దరు విడిపోతున్నారనే విషయం బయటకు వచ్చింది.

అయితే గోవిందా గురించి మరో విషయం కూడా బయటకు వచ్చింది. సునీతతో వివాహం జరిగిన తర్వాత హీరోయిన్ నీలంతో ఆయనకు అఫైర్ కొనసాగించారు. దాదాపు ఈ విషయం 4 ఏళ్లపాటు బయటకు రాకుండా వ్యవహారాన్ని చాటుమాటుగా నడించారు. వారిద్దరి పెళ్లి చేసుకోవాలని కూడా అనుకొన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు అనే విషయం మీడియాలో బయటకు వచ్చింది.

అయితే బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. సునీత, గోవిందా మధ్య పరిష్కరించుకోలేనంతగా వివాదాలు నెలకొన్నాయి. వారిద్దరూ త్వరలోనే డైవోర్స్ తీసుకోబోతున్నారు. విడాకుల విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే 37 ఏళ్ల సుదీర్ఘమైన దాంపత్య జీవితానికి తెర పడటం సన్నిహితులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారనే బయటకు వచ్చింది.

More from Filmibeat

Read more about: govinda sunitha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X