రేవ్ పార్టీలో మునిగి తేలిన సినీ తారలు.. డ్రగ్స్ మత్తులో పట్టుబడ్డ హీరోయిన్లు.. ఫోటోలు వైరల్

సినీ తారలపై డ్రగ్స్, రేవ్ పార్టీ ఆరోపణలు రావడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారింది. గతంలో దేశవ్యాప్తంగా హీరో, హీరోయిన్లు డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటూ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులకు చిక్కడం సంచలనంగా మారింది. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఈ ఆరోపణలు ఎక్కువ కావడం మరింత సంచలనం రేపాయి. రియా చక్రవర్తితోపాటు పలువురు అగ్రహీరోయిన్లపై కూడా ఆరోపణలు రావడం బాలీవుడ్‌పై చెరపలేని మచ్చగా మార్చింది. అయితే తాజాగా ముంబైలో జరిగిన రేవ్ పార్టీ గురించిన ఫోటోలు వైరల్ కావడం మరోసారి చర్చకు దారి తీసింది. ఈ రేవ్ పార్టీ వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్‌కు డ్రగ్స్ ఉచ్చు: గత కొద్దికాలంగా డ్రగ్స్ ఆరోపణలు బాలీవుడ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. పలువురు అగ్రహీరోలు, హీరోయిన్లు డ్రగ్స్‌తో దొరికిన దాఖలాలు ఉన్నాయి. దీపిక పదుకోన్, రకుల్ ప్రీత్ సింగ్, సారా ఆలీ ఖాన్ లాంటి హీరోయిన్లు డ్రగ్స్ వాడినట్టు ఎన్సీబీ ఆరోపణలు చేసింది. వారిని ముంబైలో పలు దఫాలు విచారించడం సంచలనం రేపింది.

Is Heroine Bhumi Pedneker and Khushi Kapoor attended for Rave and Drug party?

కరణ్ జోహర్ ఇంట్లో పార్టీ జరిగిన సమయంలో: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ ఇచ్చిన పార్టీకి హిందీ సినిమా పరిశ్రమలోని సూపర్ స్టార్స్ అందరూ పాల్గొనడం, వారు డ్రగ్స్ తీసుకొంటూ వీడియోలో దొరకడం సంచలనంగా మారింది. పలువురు రాజకీయ నేతలు కూడా ఆ వీడియోలు పోలీసులకు సమర్పించి ఫిర్యాదు చేయడంతో వారిని విచారించడం కూడా తెలిసిందే. ఆ పార్టీలో దీపిక, రణ్‌వీర్ సింగ్‌తోపాటు చాలా మంది ప్రముఖులు ఉండటం వీడియోలో కనిపించింది.

ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌తో: ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ముంబై నుంచి గోవాకు వెళ్లే క్రూయిజ్‌లో రేవ్ పార్టీ సందర్భంగా ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సెన్సేషన్‌గా మారింది. ఆర్యన్ ఖాన్‌ను ముంబైకి సమీపంలోని జైలులో రిమాండ్‌పై ఉంచడం కూడా తెలిసిందే. అవిశ్రాంత పోరాటం తర్వాత ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించింది.

Is Heroine Bhumi Pedneker and Khushi Kapoor attended for Rave and Drug party?

భూమి పడ్నేకర్ సెక్స్ పార్టీలో అంటూ: తాజాగా ముంబైలో డ్రగ్స్ తీసుకొంటూ రేవ్ పార్టీలో పాల్గొన్నారు అంటూ ప్రముఖ క్రిటిక్ ఉమేర్ సంధూ ఫోటోలు పెట్టడం సంచలనంగా మారింది. ఏప్రిల్ 7వ తేదీన ఉమేర్ సంధూ పోస్ట్ పెడుతూ.. గత రాత్రి మేుంబైలో సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలు డ్రగ్స్, సెక్స్ పార్టీలో మునిగి తేలారు. పార్టీలో పాల్గొన్న వారు విపరీతంగా తాగి మత్తులో సోయి లేకుండా ఊగితూలారు. ఊరి అనే దళారి వారికి అన్ని సమకూర్చాడు. ఈ పార్టీలో భూమీ పడ్నేకర్, ఆమె సోదరి ఖుషీ కపూర్, ఇతర సంపన్న వర్గాల పిల్లలు ఉన్నారు. వారంతా డ్రగ్స్ తీసుకొన్నారు అంటూ సోషల్ మీడియాలో ఉమేర్ పోస్టు పెట్టారు.

ఎన్సీబీ అధికారులు స్పందిస్తారా?: ఉమేర్ సంధూ పెట్టిన సోషల్ మీడియా పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. ట్విట్టర్‌లో ఫోటోలతో సహా ఆధారాలు చూపెడుతూ పెట్టిన పోస్టుపై ఎన్సీబీ అధికారులు గానీ, పోలీసులు గానీ స్పందించి సుమోటోగా కేసులు నమోదు చేస్తారా అనే విషయం చర్చనీయాంశమైంది. ఈ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X