స్టార్ హీరోయిన్ పేరెంట్స్ గురించి అలాంటి రూమర్స్ .. 30 ఏళ్లనాటి వైరల్

ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న వారిలో దీపికా పదుకొనే ఒకరు. సౌత్ నుంచి వెళ్లి హేమాహేమీలు ఉన్న బాలీవుడ్‌లో పాగా వేశారు దీపిక. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మాతృత్వపు అనుభూతిని అనుభవిస్తున్నారు. దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటీమణుల్లో ఆమె కూడా ఒకరు. ప్రస్తుతానికి సినిమాలకు బ్రేక్ ఇచ్చిన దీపిక.. తర్వాత మళ్లీ సినిమాలతో బిజీ కానున్నారు.

5 జనవరి 1986న డెన్మార్క్‌లోని కోపెన్ హెగన్‌లోజన్మించారు దీపికా పదుకొనే. తత్లిదండ్రులు ప్రకాష్ పదుకొనే, ఉజాలా. ప్రకాష్ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కాగా తల్లి ట్రావెల్ ఏజెంట్. దీపికకు అనిషా అనే చెల్లి కూడా ఉండగా ఈమె గోల్ఫర్‌గా వ్యవహరిస్తున్నారు. బెంగళూరులోని సోపియా హైస్కూల్, మౌంట్ కార్మెల్ కాలేజీలో దీపికా పదుకొనే చదువుకున్నారు. అయితే మోడలింగ్‌లో బిజీ కావడంతో ఆమె ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా సోషియాలజీలో డిగ్రీ పట్టా అందుకున్నారు.

is heroine Deepika Padukone s Parents Prakash And Ujjala Are Cousins

2006లో ఐశ్వర్య అనే కన్నడ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన దీపిక తర్వాత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఓం శాంతి ఓం, లవ్ ఆజ్ కాల్, హౌస్‌ఫుల్, డమ్ మారో దమ్, కాక్‌టెయిల్, రేస్, దేశీ బాయ్స్, బాంబే టాకీస్, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూఇయర్, పీకూ, బాజీరావ్ మస్తానీ, పద్మావత్, జీరో, బ్రహ్మస్త్ర పార్ట్ 1, పఠాన్, జవాన్, ఫైటర్ , సింగమ్ ఎగైన్ చిత్రాలతో బాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఎదిగారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చారు దీపికా పదుకొనే. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌ను ప్రేమించి పెళ్లాడిన ఆమె ఈ ఏడాది సెప్టెంబర్‌లో పండండి ఆడపిల్లకు జన్మనిచ్చారు.

ఈ నేపథ్యంలో దీపిక తల్లిదండ్రుల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నారి దీపిక, అనిషలు తమ తల్లిదండ్రులతో ఉన్న ఫోటో కూడా అందులో ఉంది. ఆమె తండ్రి ప్రకాష్ పదుకొనే గురించి అందరికీ తెలిసిందే , అయితే తల్లి ఉజ్జల గురించి తెలిసింది అంతంత మాత్రమే. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ రెడిట్‌లో ఇటీవల ప్రకాష్ - ఉజ్జలలు కజిన్స్ అని ఓ న్యూస్ వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు తలోరకంగా స్పందించారు. ఈ వార్త చూసి తానేమీ ఆశ్చర్యపోలేదని.. దక్షిణ భారతదేశంలో రక్త సంబంధీకుల మధ్యే (మేన మామ , మేన బావ) పెళ్లిళ్లు జరుగుతుంటాయని ఓ యూజర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రపంచీకరణ కారణంగా యువత స్వస్థలాలను వదిలి వెళ్తుండటంతో ఇవి స్వల్పంగా తగ్గాయని వ్యాఖ్యానించారు.

is heroine Deepika Padukone s Parents Prakash And Ujjala Are Cousins

అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో ఉజ్జలతో వివాహం గురించి ప్రకాష్ మాట్లాడుతూ.. ప్రపంచ నెంబర్ 1 అయినప్పటికీ, ఓసారి జాతీయ ఛాంపియన్‌షిప్‌ను కోల్పోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిపారు. ఈ క్రమంలో తన సెకండ్ కజిన్ ఉజ్జలను వివాహం చేసుకుని కోపెన్‌హెగన్‌కు వెళ్లగా అక్కడ ఉద్యోగం దొరికిందని, దీపిక పుట్టే వరకు 1986 వరకు తాము అక్కడే ఉన్నామని, 1989లో పదవీ విరమణ చేసినట్లు ప్రకాష్ పదుకొనే వెల్లడించారు. సో అదన్న మాట మేటర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X