అమీర్ ఖాన్ కుటుంబంలో మరో విడాకుల కలకలం.. ఈసారి ఎవరంటే
బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ కుటుంబంలో మరో వైవాహిక బంధానికి తెరపడునుందా అనే అనుమానాలకు కొన్ని వార్తలు బలాన్ని కలిగిస్తున్నాయి. అమీర్ మేనల్లుడు, హీరో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య అవంతిక మాలిక్ విడిపోతున్నారని బాలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇమ్రాన్ ఖాన్ భార్య అవంతిక సోషల్ మీడియాలో పోస్టు చేసిన భావోద్వేగమైన సందేశం అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

ఇమ్రాన్ ఖాన్ దంపతులు విడిపోతున్నారంటూ
గతంలో అవంతిక, ఇమ్రాన్ విడిపోతున్నారనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. అయితే అవంతిక తల్లి వందన మాలిక్ మాత్రం కొట్టిపడేసింది. అయితే వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు కొనసాగుతున్నాయి అని మీడియాకు తెలిపింది. అయితే వాటిని పరిష్కరించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పారు.

అవంతిక పోస్టుపై అనుమానాలు
తాజాగా మరోసారి ఇమ్రాన్ ఖాన్, అవంతిక మాలిక్ మధ్య విభేదాలు నెలకొన్నాయనే వార్తలు మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే వారిద్దరిలో ఎవరూ కూడా బయటపడిన దాఖలాలు లేవు. అయితే వాటిని బయటకు రాకుండా జాగ్రత్త పడినట్టు కనిపించింది. అయితే అవంతిక తాజా పోస్టు అనేక సందేహాలకు దారితీస్తున్నది.

భావోద్వేగంతో అవంతిక పోస్టు
అవంతిక పోస్టు చేసిన పోస్టులో.. కొన్నిసార్లు మనం దూరంగా వెళ్లిపోవాలి. నీకు బలంగా మారుతున్న అంశాలను కూడా చూసుకోవాలి. ఒకవేళ ఆగిపోయినా వాటిని సమీక్షించుకోవాలి. వాటికి ఆమోదం లభించేలా చూసుకోవాలి. వాటితోనే నిచ్చెనను ఎక్కేందుకు ప్రయత్నించాలి అంటూ ఏదో ఒక ఎమోషనల్ పోస్టును పెట్టింది. అయితే వెంటనే ఆ పోస్టును డిలీట్ చేయడం గమనార్హం.

ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ కెరీర్ గురించి
నటుడు ఇమ్రాన్ ఖాన్, అవంతిక 2011లో పెళ్లి చేసుకొన్నారు. వారికి ఇమారా అనే అమ్మాయి 2014లో జన్మించింది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. జానే తు.. యా జానే నా, కిడ్నాప్, ఐ హేట్ లవ్ స్టోరీస్, ఢిల్లీ బెల్లీ, గోరి తేరి ప్యార్ మే, కట్టి బట్టి అనే చిత్రాల్లో ఇమ్రాన్ నటించాడు. ఇక అమీర్ ఖాన్ విషయానికి వస్తే తన తొలి భార్య రీనాదత్తాకు విడాకులు ఇచ్చి.. కిరణ్ రావును పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











